Site icon NTV Telugu

Ponguleti Srinivas Reddy : మంత్రి పొంగులేటి కారుకు ప్రమాదం.. తృటిలో తప్పిన ప్రమాదం

Ponguleti Srinivad Reddy

Ponguleti Srinivad Reddy

Ponguleti Srinivas Reddy : రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రయాణం చేస్తున్న కారుకి ఒకేసారి రెండు టైర్లు ప్రేలడం తో డ్యూటీలో ప్రమాదం తప్పింది. డ్రైవర్ చాక చక్యం తో ప్రమాదాన్ని తప్పించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు ఉదయం ఖమ్మం నుంచి వరంగల్ జిల్లాలో ఇన్చార్జి మంత్రి హోదా లో పర్యటనలో పాల్గొనేందుకు వెళ్లారు తిరిగి వస్తుండగా తిరుమలాయపాలెం సమీపంలో కారు రెండు టైర్లు బారెస్ట్ అయ్యాయి. అయితే డ్రైవర్ కార్ నీ కంట్రోల్ చేయగలిగారు.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన ల్యాండ్ క్రూజర్ లో పర్యటనలు చేస్తున్నరు.. ఆ ల్యాండ్ క్రూజర్ సంబంధించిన టైర్లు పేలిపోయాయి.. అనంతరం సెక్యూరిటీ కి చెందిన కార్ లో ఇంటికి చేరుకున్నారు.. ఎటువంటి ప్రమాదం జరుగక పోవడం తో ఊపిరి పిల్చుకున్నారు..

Stock Market : ముంబై నుండి కరాచీ వరకు దయనీయ స్థితిలో స్టాక్ మార్కెట్.. దివాళా తీస్తున్న ఇన్వెస్టర్లు

Exit mobile version