శేరిలింగంపల్లి నియోజక వర్గం ఎల్లమ్మ బండ లో మరబోయిన రఘునాథ్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ యువత మేలుకో కార్యక్రమం లో ఖమ్మం మాజీ పార్లెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం కావాలని 60 సంవత్సరాలు పోరాడి సాధించుకున్నాం.. అన్ని వర్గ ప్రాంతాల వారీగా ఉస్మానియా,కాకతీయ అన్ని యునివర్సటీ విద్యార్థుల పోరాటం తో నే తెలంగాణ సాధించుకున్నామన్నారు. బంగారు తెలగాణ,ప్రతి ఇంటికి ఉద్యోగం వస్తుందని అనుకున్నాం.. బడ్జెట్లో పేరు కోసం కోట్ల అంకెలు చూపించిన అన్ని యునివర్సటీ లను గంగలో కలిపింది కేసీఅర్ అని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా..’మంచి వైద్యం, మంచి విద్యను తుంగలోకి తొక్కారు.. మల్లారెడ్డి లాంటి వారి కోసం ప్రయివేట్ విద్యాసంస్థలు ఏర్పాటు చేసి శఠగోపం పెట్టిన ఘనుడు కేసీఅర్.. కేసీఅర్ నాయకత్వ లో డ్రగ్స్ కి అడ్డగ ఏర్పాటు చేసిన ఘనత కేసీఅర్ కి దక్కింది..
Also Read : Bhatti Vikramarka : అప్పులు పుట్టకపోవడంతో రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టారు
డ్రగ్స్ విశయం పై పేపర్ లో స్టేట్ మెంట్లు తప్ప ఎవరికీ శిక్ష పడలేదు. ఒక్కరూపాయి నిరుద్యోగ భృతి దక్కలేదు.. ఎన్నికల ముందే నోటిఫికేషన్లు గుర్తుకు వస్తాయి.. పేపర్ లీక్ పై కాలయాపన చేస్తున్నరు..ఎవరికీ శిక్ష వేయలేదు.. ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారో మీరు డిబేట్ పెడితే యువతే చెపుతోంది.. ఇలాంటి సమయంలో యువత మేలు కోవాలి..మేము తీసుకొనే నిర్ణయాల్లో యువత కి ప్రధానమైన పాత్ర ఉంటుంది.. రఘునాథ్ యాదవ్ భవిష్యత్లో మతో కలసి ప్రయాణం చేస్తారు.. రాష్ట్ర రాజకయాల్లో యువత యక్టివ్ గా ఉండాలి..’ అని పొంగులేటి వ్యాఖ్యానించారు.
