Site icon NTV Telugu

Pomegranate Farming: వ్యాపారం వదిలేశాడు.. దానిమ్మ సాగు స్టార్ట్ చేశాడు… ఏడాది రూ.40 లక్షలు సంపాదిస్తున్నాడు

Pomegranate Farming

Pomegranate Farming

Pomegranate Farming: రాజస్థాన్‌లోని రైతులు ఇప్పుడు సాంప్రదాయ వ్యవసాయం చేయకుండా హార్టికల్చర్‌లో ఎక్కువ కష్టపడుతున్నారు. దీంతో ఇక్కడి రైతులు ఇప్పుడు ఉద్యానవనంపై వచ్చే ఆదాయంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వారి సంపాదన లక్షల్లో చేరుతోంది. నిమ్మ, మామిడి, దానిమ్మ, చీకూ, దోసకాయ సాగు చేస్తూ ఏడాదికి రూ.40 సంపాదిస్తున్న రాజస్థాన్‌కు చెందిన రైతు గురించి తెలుసుకుందాం. విశేషమేమిటంటే.. ఈ రైతు పండించే దానిమ్మకు విదేశాల్లో కూడా డిమాండ్ ఉండటం.

అతడు రాజస్థాన్‌లోని సిరోహి జిల్లాలో నివసిస్తున్న శ్రవణ్ సింగ్. శ్రవణ్ సింగ్ ఉన్నత విద్య చదువుకున్నాడు. అతను గ్రాడ్యుయేట్. ఇంతకు ముందు అతను రెడీమేడ్ బట్టల వ్యాపారం చేసేవాడు. కానీ అతను ఈ వ్యాపారంపై ఆసక్తి ఎందుకో సన్నగిల్లింది. అలాంటి పరిస్థితిలో శ్రవణ్ సింగ్ గార్డెనింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆధునిక పద్దతిలో నిమ్మ, మామిడి, వెర్మిలియన్, దానిమ్మ, చీకు, ఖేరీ సాగు చేస్తున్నాడు. దీంతో ఏడాదిలో రూ.40 లక్షలు సంపాదిస్తున్నాడు.

Read Also:Air India Sale: డెడ్ ఛీప్‎గా ఎయిర్ ఇండియా ఫ్లైట్ టిక్కెట్లు.. కేవలం రూ. 1470కే

12 హెక్టార్లలో నిమ్మ సాగు
శ్రవణ్‌సింగ్‌ మొదట బొప్పాయి పంటతో హార్టికల్చర్‌ను ప్రారంభించాడు. ఇందులో అతనికి మంచి లాభాలు వచ్చాయి. అతను క్రమంగా హార్టికల్చర్ విస్తీర్ణాన్ని పెంచాడు. అలాంటి పరిస్థితుల్లో మూడో ఏడాది నుంచి రూ.18 లక్షలు సంపాదించడం ప్రారంభించాడు. దీని తర్వాత 2011లో 12 హెక్టార్లలో నిమ్మ సాగు చేశాడు. ఆ తర్వాత 2013 సంవత్సరం నుంచి దానిమ్మ చెట్లను కూడా నాటడం ప్రారంభించాడు. 2 సంవత్సరాల తర్వాత మాత్రమే దానిమ్మ ఉత్పత్తి ప్రారంభమైంది. తన పొలంలో పండించిన దానిమ్మ బంగ్లాదేశ్, నేపాల్, దుబాయ్ దేశాలకు కూడా సరఫరా అవుతుందని శ్రవణ్ సింగ్ చెబుతున్నాడు. విశేషమేమిటంటే ల్యాబ్‌లో పరీక్షించిన తర్వాత వారి ఉత్పత్తులను ఎగుమతి చేస్తారు. దీంతో పాటు రిలయన్స్ ఫ్రెష్, సూపర్ మార్కెట్, జైన్ ఇరిగేషన్ వంటి బహుళజాతి కంపెనీలకు కూడా పండ్లను సరఫరా చేస్తున్నారు.

ద్రాక్షపై ప్రయోగాలు
ప్రస్తుతం శ్రవణ్ సింగ్ ద్రాక్షపై కూడా ప్రయోగాలు చేస్తున్నాడు. దానిమ్మ, నిమ్మ, జామ పండ్లను అమ్మడం ద్వారా ఏడాదికి రూ.40 లక్షలు సంపాదిస్తున్నట్లు చెప్పారు.

Read Also:Gold Today Price: మగువలకు పండగ లాంటి వార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు! తులం పసిడి ఎంత ఉందంటే?

Exit mobile version