పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశానికి ఏటా పరీక్ష నిర్వహిస్తుంటారు. అదే పాలిసెట్. మే 24న పాలిసెట్ రాత పరీక్ష ముగిసింది. ఇటీవలె మూల్యాంకనం కూడా పూర్త అయ్యింది. ప్రస్తుతం, ఈ పరీక్షలకు సంబంధించి ఫలితాలను విడుదల చేసేందుకు సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఫలితాల విడుదలకు సంబంధించి వివరాలను అధికారులు వెల్లడించారు. రేపు.. అంటే జూన్ 3వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఐఏఎస్, తెలంగాణ ఎస్‌బీటీఈటీ ఛైర్మన్ శ్రీ బి. వెంకటేషం, ఎస్‌బీటీఈటీ ఎస్.వీ భవన్, మాసబ్ ట్యాంక్, హైదరాబాద్‌లో పాలిసెట్ 2024 ఫలితాలను విడుదల చేయనున్నారు.
READ MORE: Rain: హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం
కాగా.. మే 24న పాలిసెట్ రాత పరీక్ష ప్రశాంతంగా జరిగింది. మొత్తం 49 పరీక్షా కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహించారు. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఆవరణలో టిసిఎస్ సహకారంతో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అన్ని పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, విజయవాడ పట్టణాల్లో సైతం పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 31,725 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 27495 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 4232 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. మూడు విడతలుగా జరగ్గా.. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు జరిగిన పరీక్షలో 85% మంది , రెండో విడత 12:30 నుండి 2:30 వరకు జరగగా 86%, మూడవ విడత నాలుగు గంటల నుండి 6 గంటల వరకు 88% మంది హాజరయ్యారు. ప్రశ్నాపత్రాల కోడ్ విడుదల అనంతరం పరిశీలనకు వెళ్లిన ఆచార్య లింబాద్రి.. ఆన్లైన్ పరీక్ష విధానాన్ని వివరించారు.