Site icon NTV Telugu

Polycet 2025: నేడే పాలీసెట్ 2025 పరీక్ష.. ఒక్క నిమిషం ఆలస్యమైన ‘నో ఎంట్రీ’..!

Entrance Exam Polycet

Entrance Exam Polycet

Polycet 2025: నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ లలో 3 సంవత్సరాల ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటుగా.. వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమా కోర్సుల ప్రవేశానికై పాలిటెక్నిక్ ఎంట్రన్స్-2025 (Polycet 2025) పరీక్ష జరుగుతుంది. నేడు (మంగళవారం) రోజున ఉదయం 11.00 గం. నుండి మధ్యాహ్నం 1.30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షా జరగనుంది.

Read Also: LRS Scheme: మే 31 వరకు ఎల్‌ఆర్‍ఎస్ రాయితీ గడువు పొడిగించిన ప్రభుత్వం..!

ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 1,06,716 మంది అభ్యర్థులు 276 పరీక్ష కేంద్రాలలో హాజరవుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక పరీక్షకు హాజరయ్యే విద్యార్థులను పరీక్ష కేంద్రానికి ఒక గంట ముందుగానే అనుమతిస్తారు. కాబట్టి, హాజరయ్యే వారు ఉదయం 10.00 గంటలకే పరీక్ష హాలులోకి చేరుకోవాల్సి ఉంటుంది. ఇక పరీక్ష ఉదయం 11.00 గం. ప్రారంభం తరువాత ఒక్క నిమిషం ఆలస్యం అయిన అభ్యర్థులను పరీక్ష కేంద్రం లోనికి అనుమతించబడరు.

Read Also: Sachin Tendulkar: విరాట్ కోహ్లీ టెస్టు రిటైర్మెంట్ పై సచిన్ టెండూల్కర్ భావోద్వేకం..!

ఇక పరీక్షా కోసం వెళ్లే విద్యార్థులు HB బ్లాక్ పెన్సిల్, ఏరేసర్, బ్లూ లేదా బ్లాక్ బాల్ పెన్ తీసుక వెళ్ళాలి. హాల్ టికెట్ మీద ఫోటో ప్రింట్ కానివారు ఒక పాస్ పోర్ట్ సైజు ఫోటో, ఐడి ప్రూఫ్ కచ్చితంగా తెచ్చుకోవలెను. అలాగే పరీక్ష కేంద్రంలోకి సెల్ ఫోన్, మరే ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులు అనుమతించబడవు. విద్యార్థులు పరీక్ష కేంద్రాన్ని గుర్తించడానికి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల ద్వారా గూగుల్ ప్లే స్టోర్ నుండి SBTET TG యాప్ ను ఇన్స్టాల్ చేసుకొని, పరీక్షా కేంద్రం లోకేషన్ కై POLYCET Exam సెంటర్ లొకేటర్ టాబ్ ని తెరవండి. అక్కడ మీ వివరాలు అందిస్తే.. మీ సెంటర్ కు ఎలా చేరుకోవాలో సులువుగా తెలుసుకోవచ్చు.

Exit mobile version