Site icon NTV Telugu

Bihar Elections 2025: బీహార్‌లో ప్రశాంతంగా ముగిసిన తొలిదశ ఎన్నికల పోలింగ్‌..

Bihar Elections 2025

Bihar Elections 2025

బీహార్‌లో తొలిదశ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. సమయం ముగిసినా క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసేందకు అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గానూ తొలి దశలో 18 జిల్లాల్లోని 121 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరిగింది. తొలి విడతలో ఇప్పటివరకు 58 శాతం ఓటింగ్‌ నమోదైంది. తొలి విడతలో మొత్తం 121 స్థానాల్లో పోలింగ్‌ జరిగింది. నవంబర్‌ 11న రెండవ విడతలో 122 అసెంబ్లీ సీట్లకు పోలింగ్‌ జరుగనున్నది. నవంబర్‌ 14న ఫలితాలు వెల్లడికానున్నాయి.

Also Read:AP Update : ఏపీ సర్కార్ సంచలనం.. గ్రామ సచివాలయాల పేరు మార్పు

నేడు పోటీ చేస్తున్న ప్రముఖులలో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నాయకుడు తేజస్వి యాదవ్, ఆయన సోదరుడు, జనశక్తి జనతాదళ్ (జెజేడీ) అధినేత తేజ్ ప్రతాప్ యాదవ్, డిప్యూటీ సీఎంలు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా, అనంత్ సింగ్ తదితరులు ఉన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా, సిమ్రీ భక్తియార్‌పూర్, మహిషి, తారాపూర్, ముంగేర్, జమాల్‌పూర్, సూర్యగఢ నియోజకవర్గం పరిధిలోని 56 బూత్‌లలో పోలింగ్ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది.

Exit mobile version