Election Commission: మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పీఎస్ నంబర్ 202తో పాటు 7 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేశారని ఏపీ సీఈవో కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. పోలింగ్ కేంద్రం నంబర్ 202లో జరిగిన ఘటనలో సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెబ్ కెమెరాలో రికార్డయ్యారని తెలిపింది. ఈవీఎంల ధ్వంసం ఘటనకు సంబంధించి కేసు దర్యాప్తులో సహకరించేందుకు పల్నాడు జిల్లా ఎన్నికల అధికారులు అటువంటి అన్ని పోలింగ్ స్టేషన్ల వీడియో ఫుటేజీని పోలీసులకు అందజేశారు. విచారణలో ఎమ్మెల్యే పేరును నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని ఈసీ చాలా తీవ్రంగా పరిగణిస్తూ, ఈ ఘటనల్లో ప్రమేయం ఉన్న వ్యక్తులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి తెలియజేయాలని సీఈవో ముఖేష్ కుమార్ మీనాను ఆదేశించింది. తద్వారా ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించే విషయంలో భవిష్యత్తులో ఎవరూ ఇటువంటి దుశ్చర్యలకు సాహసం చేయరని ఎన్నికల సంఘం భావిస్తోంది. ఈవీఎం ధ్వంసానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
Read Also: Bomb Threat : ఢిల్లీ పాఠశాలలకు బాంబు బెదిరింపు.. పోలీసులకు కీలక ఆధారాలు