Site icon NTV Telugu

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

Vallabhaneni Vamsi

Vallabhaneni Vamsi

వల్లభనేని వంశీని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. విజయవాడ సబ్ జైలు నుంచి వంశీని కంకిపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. బాపులపాడులో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీ పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులోనే వంశీని 2 రోజులపాటు కోర్టు అనుమతితో విచారించనున్నారు పోలిసులు. పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేసి.. వంశీని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా వల్లభనేని వంశీకి కోర్టు రిమాండ్ విధించింది. ఇప్పటికే వల్లభనేని వంశీ పలు కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.

Exit mobile version