Site icon NTV Telugu

Actor Minu Muneer: సినిమాల్లో అవకాశం పేరుతో సె*క్స్‌ రాకెట్‌కు మైనర్‌ బాలిక అప్పగింత..! ప్రముఖ నటి అరెస్ట్..

Actor Minu Muneer

Actor Minu Muneer

Actor Minu Muneer: సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంటే నమ్మి చెన్నై వచ్చిన 14 ఏళ్ల బాలికపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన కేసులో మలయాళ సినీనటి మిను మునీర్‌ను పోలీసులు అరెస్టుచే శారు. పోలీసుల కథనం.. పదేళ్ల క్రితం మిను మునీర్.. సినిమాల్లో నటించేలా చేస్తానని చెప్పి తన బంధువు కుమార్తె అయిన 14 ఏళ్ల బాలికను చెన్నై తీసుకొచ్చి ఓ ప్రైవేటు హోటల్లో ఉంచింది. ఆ సమయంలో నలుగురు వ్యక్తులు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు పదేళ్ల తర్వాత ఈ ఏడాది మార్చిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన చెన్నై తిరుమంగళం ఆల్ ఉమెన్ పోలీసులు.. నటి మిను మునీర్నును గురువారం అరెస్టు చేసి, చెన్నైకి తరలించారు.. ఈ కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: Strange Death: గొంతులో కోడిగుడ్డు ఇరుక్కుని వ్యక్తి మృతి!

మొత్తంగా 2014లో ఒక బాలికను సెక్స్ రాకెట్‌కు అమ్మేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో తమిళనాడు పోలీసులు మలయాళ నటీ మిను మునీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. నివేదికల ప్రకారం, తమిళనాడు పోలీసుల బృందం బుధవారం రాత్రి అలువాలోని ఆమె నివాసంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.. ఫిర్యాదు ప్రకారం, మిను తన బంధువు అయిన బాలికకు సినిమా అవకాశం ఇప్పిస్తానని హామీ ఇచ్చి తమిళనాడుకు తీసుకెళ్లి, ఆపై సెక్స్ రాకెట్‌కు అప్పగించడానికి ప్రయత్నించింది. 10 ఏళ్ల తర్వాత బాధిత మహిళ ఫిర్యాదు ఆధారంగా తిరుమంగళం పోలీసులు మినుపై కేసు నమోదు చేశారు.

Read Also: Off The Record: ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే రెచ్చిపోతూ గుట్లు బయటేసుకుంటున్నారా?

మరోవైపు జులైలో, ప్రముఖ మలయాళ నటుడు-దర్శకుడు బాలచంద్ర మీనన్‌పై పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను పోస్ట్ చేసినందుకు కొచ్చి నగర సైబర్ క్రైమ్ పోలీసులు మినును అరెస్టు చేశారు. కేరళ హైకోర్టు ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చిన తర్వాత ఆమె పోలీసులకు లొంగిపోయింది, కానీ, కోర్టు ఆదేశాల మేరకు తరువాత బెయిల్‌పై విడుదలైంది. 2024లో, సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను బహిర్గతం చేసిన జస్టిస్ హేమా కమిషన్ నివేదిక విడుదలైన తర్వాత, మలయాళ నటులపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి మిను మునీర్ వార్తల్లో నిలిచింది. ఇప్పుడు సెక్స్‌ రాకెట్‌కు బాలికను అమ్మే ప్రయత్నం చేసిందనే ఆరోపణలపై అరెస్ట్ అయ్యింది..

Exit mobile version