NTV Telugu Site icon

Viral : ఖైదీతో పోలీసుల షాపింగ్ మాల్ కు.. వీడియో వైరల్

Uthar Pradesh

Uthar Pradesh

విధి నిర్వహణలో ఉన్న పోలీసులు ఓ ఖైదీని తమ వెంటబెట్టుకుని షాపింగ్ మాల్ కు తీసుకెళ్లారు. జైలుకు తీసుకెళ్లాల్సిన నిందితుడిని షాపింగ్ క తీసుకెళ్లిన పోలీసుల ఘనాకర్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది. దీంతో ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఎస్ఐ పాటు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్లు ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది.

Also Read :

రిషబ్ రాయ్ అనే వ్యక్తిని అక్రమ ఆయుధాల కేసులో గత జూన్ లో అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అయితే ఇటీవల తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, ఆస్పత్రికి వెళ్లేందుకు కోర్టును రిషబ్ రాయ్ అనుమతి కోరాడు. అతని దరఖాస్తుని పరిశీలించిన కోర్టు రిషబ్ కు అనుమతిని కూడా మంజూరు చేసింది. ఈ క్రమంలో పోలీసుల అధికారులు అతన్నీ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించడంతో పాటు వైద్య పరీక్షలు జరిపించారు. అనంతరం వాళ్లు తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉంది. అయితే నేరుగా జైలుకు కాకుండా దారిలో షాపింగ్ మాల్ కు పోలీసులు వెళ్లారు. వెళ్తూ తమతో పాటు ఆ ఖైదీని కూడా మాల్ లోపలికి తీసుకెళ్లారు. ఇదంతా ఆ పరిసరాల్లోని సీసీ టీవీ పుటేజ్ లో రికార్డ్ కాగా.. ఈ వీడియోని ట్విట్టర్ యూజర్ షేర్ చేశాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

Show comments