Site icon NTV Telugu

Special Drive : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసుల స్పెషల్ డ్రైవ్

Bike Checking

Bike Checking

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నంబర్ ప్లేట్ లేని వాహనాలను గుర్తించి వాహనదారులను సరైన క్రమంలో ప్రభుత్వ గుర్తింపు ప్రకారం ఉన్న నంబర్ ప్లేట్లను అమర్చాలనే జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణాలను ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ ను కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు 50 నంబర్ ప్లేట్ లేని వాహనాలను గుర్తించడం జరిగిందని, వారం రోజులుగా ఇప్పటివరకు 321 వాహనాలను గుర్తించి వారి వాహనాలను తాత్కాలికంగా సీజ్ చేసి, ఒరిజినల్ రిజిస్ట్రేషన్ కార్డు ఆధారంగా నంబర్ ప్లేట్లను దగ్గరుండి ఏర్పాటు చేసి, నంబర్ ప్లేట్ లేని వాహనాలకు జరిమానా విధించి విడిచి పెట్టడం జరిగిందని తెలిపారు.

తరచూ కావాలనే నంబర్ ప్లేట్ లేకుండా తిరిగే వాహనదారుల పట్ల వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా నంబర్ ప్లేట్ నందు వాహనం యొక్క నంబర్ ఓకే పరిమాణం నందు ఉండాలని ప్రభుత్వం ద్వారా నిర్దేశించబడిన నంబర్ ప్లేట్లను వాడాలని సూచించారు. ఎవరైనా కావాలని ఒక నెంబర్కు బదులుగా ఇంకొక నెంబర్ను ఏర్పాటు చేసినట్లయితే వాహనాన్ని సీజ్ చేసి, వారిపై చీటింగ్ ఫోర్జరీ కేసులు నమోదు చేయబడతాయని హెచ్చరించారు. ఈ స్పెషల్ ఆపరేషన్ నందు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రణయ్ కుమార్ , వారి సిబ్బంది పాల్గొన్నారు.

 

Exit mobile version