మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ లో పోలీసుల సమయస్ఫూర్తి ఓ మహిళా ప్రాణాలను కాపాడింది. ఏవో కారణాలతో ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు డయల్ 100కి కాల్ చేసి మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుంటుందని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు 5 నిమిషాల్లో ఘటన స్థలానికి చేరుకున్నారు. వెంటనే ఇంటి తలుపులు పగలగొట్టారు. అప్పటికే మహిళ ఉరివేసుకుని ఉండటంతో కిందికి దించి పోలీసులు సీపీఆర్ చేశారు.
Also Read:Nobel Peace Prize: రాహుల్ గాంధీ నోబెల్ శాంతి పురస్కారానికి అర్హుడే..? కారణం చెప్పిన కాంగ్రెస్ నేత..!
ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ ప్రాణాలను పొలీసులు కాపాడారు. దీంతో మహిళకు ప్రాణాపాయం తప్పినట్లైంది. ఆ తర్వాత మెదక్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సకాలంలో స్పందించి మహిళ ప్రాణాలు కాపాడిన పోలీసులపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. ఎవరూ కూడా ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించారు. పరిష్కారం లేని సమస్యలంటూ లేవని.. ఆత్మహత్యలే శరణ్యం కాదని సూచించారు.
