Site icon NTV Telugu

Vallabhaneni Vamsi: వంశీని మూడు గంటల పాటు ప్రశ్నించిన పోలీసులు..

Vamshi

Vamshi

కంకిపాడు పోలీస్ స్టేషన్ లో వల్లభనేని వంశీ విచారణ ముగిసింది. మూడు గంటలపాటు విచారణ సాగింది. వంశీని మూడు గంటలపాటు పోలీసులు ప్రశ్నించారు. విచారణలో స్థల ఆక్రమణ, బెదిరింపులకు సంబంధించిన పలు ప్రశ్నలు వంశీని పోలీసులు అడిగారు. కేసుతో సంబంధమున్న ఇతరుల వివరాలు కూడా ఆరా తీసిన పోలీసులు. విచారణ అనంతరం వైద్య పరీక్షలు నిమిత్తం కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి వంశీని తరలించారు. వైద్య పరీక్షలు అనంతరం పోలీసులు గన్నవరం కోర్టులో వంశీని హాజరు పర్చారు. పోలీసుల విచారణ తీరుపై జడ్జి వంశీని ప్రశ్నించారు. థర్డ్ డిగ్రీ ఉపయోగించారా అని వంశీని జడ్జి అడిగారు. లాయర్ సమక్షంలో విచారణ సక్రమంగా జరిగిందని వంశీ జడ్జికి సమాధానం ఇచ్చారు. కోర్ట్ విచారణ అనంతరం విజయవాడ సబ్ జైల్‌కు వంశీని పోలీసులు తరలించారు.

Exit mobile version