Site icon NTV Telugu

Pinnelli Ramakrishna Reddy: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని కస్టడీకి ఇవ్వండి.. కోర్టులో పోలీసుల పిటిషన్‌

Pinnelli

Pinnelli

Pinnelli Ramakrishna Reddy: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలింగ్‌ రోజు ఈవీఎం ధ్వంసం సహా మరికొన్ని కేసుల్లో అరెస్ట్‌ అయిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు పోలీసులు.. పల్నాడులో జరిగిన విధ్వంసాలు, పలువురుపై హత్యాయత్నం కేసుల్లో.. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రమేయం ఉందని.. ఈ కేసుల్లో మరింత లోతుగా దర్యాప్తు చేస్తే పూర్తి ఆధారాలు సేకరించే అవకాశం ఉందని.. కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు పోలీసులు.. మాచర్ల అదనపు జూనియర్ సివిల్ కోర్టులో గురువారం రోజు దాదాపు ఐదు గంటల పాటు దీనిపై వాదనలు జరిగాయి..

Read Also: Charishma Naidu : కన్నడిగులతోనే తెలుగు సీరియల్స్‌, ఇక మనమెందుకు.. నటి చరిష్మా నాయుడు సంచలన ఆరోపణలు

ఇక, ఈ పిటిషన్ పై ఇరు వర్గాల న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి.. తీర్పును ఈ రోజుకి వాయిదా వేశారు.. ఈ నేపథ్యంలో న్యాయస్థానం, పోలీసుల కస్టడీకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఇస్తుందా..? లేదంటే ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తుందా..? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాగా, సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ రోజు.. పోలింగ్‌ కేంద్రంలోకి దూసుకెళ్లిన పిన్నెల్లి.. ఈవీఎం ధ్వంసం చేసిన విషయం విదితమే.. ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసు సహా మరికొన్ని కేసుల్లో పిన్నెల్లి అరెస్ట్‌ చేశారు పోలీసులు.. ప్రస్తుతం ఆయన నెల్లూరు సెంట్రల్‌ జైలులో ఉన్న విషయం విదితమే.

Exit mobile version