NTV Telugu Site icon

Tadipatri: తాడిపత్రిలో హైటెన్షన్.. 159 మందిపై రౌడీషీట్ ఓపెన్..

Tadipatri

Tadipatri

Tadipatri: అనంతపురం జిల్లాలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. పోలింగ్‌ రోజు, తరువాత తలెత్తిన హింసాత్మక ఘటనలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా దాడుల్లో పాల్గొన్న 159 మందిపై
జిల్లా పోలీసులు రౌడీషీట్‌ ఓపెన చేశారు. అలాగే, పోలీసు బలగాలను మోహరించే విషయంలో నిర్లక్ష్యం, ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించకపోవడంతో పాటు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వలేదన్న కారణాలతో ఇప్పటికే తాడిపత్రిలోని పలువురు పోలీసులపై ఎస్పీ వేటు వేశారు.

Read Also: Jagadish Reddy: సూర్యాపేటలో ఓటు వేసిన మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి

దీంతో పాటు తాడిపత్రిలో జరిగిన ఘర్షణలకు కారణమైన వారిపై క్రమంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే 159 మందిపై రౌడీషీట్‌ తెరిచారు. ఈ దాడుల్లో పాల్గొన్న వారిని గుర్తించి వారిపై రౌడీషీట్లు ఓపెన్ చేయాలని ఇప్పటికే జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేయడంతో.. మొత్తం 159 మందిపై రౌడీషీట్లు ఓపెన్ చేసేశారు. మొత్తంగా తాడిపత్రిలో 106, యాడికిలో 37, పెద్దవడగూరులో ఏడుగురిపై రౌడీషీట్ తెరిచారు. అలాగే, పెద్దవడుగూరు మండలం దిమ్మగుడిలో ఓ దివ్యాంగుడిపై దాడి చేసిన ఏడుగురిపై కూడా కఠిన చర్యలు తీసుకున్నారు పోలీసులు. ఇక, జిల్లాలోని ఇతర పోలీసు స్టేషన్ల పరిధిలో ఉన్న మరో 9 మందిపై కూడా రౌడీషీట్లు ఓపెన్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కౌంటింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే పోలీసులు అలర్ట్ అయ్యారు.