NTV Telugu Site icon

Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. తన మామ ఇంటికి కొడుకు, కూతురు

Allu Arjun House

Allu Arjun House

అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించేందుకు ఓయూ జేఏసీ యత్నించింది. ఓయూ జేఏసీ అధ్యక్షుడూ బైరు నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో అల్లు అర్జున్ ఇల్లు ముట్టడికి ప్రయత్నం చేశారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని నినాదాలు చేశారు. రేవతి కుటుంబానికి రూ. కోటి ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఇంటి గోడలు ఎక్కి రాళ్లు రువ్వారు. అల్లు అర్జున్ ఇంట్లో పూల కుండీలు ధ్వంసమయ్యాయి. అల్లు అర్జున్ ఇంటి ముందు ఆందోళన చేసిన విద్యార్ధి సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. 8 మంది ఓయూ జేఏసీ నేతలను అదుపులోకి తీసుకొని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ తరలించారు. దాడి అనంతరం అల్లు అర్జున్ మామ చంద్ర శేఖర్ రెడ్డి అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు. దాడి ఎలా జరిగింది..? దాడి వివరాలను సెక్యూరిటీని అడిగి తెలుసుకున్నారు. అనంతరం.. అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి అల్లు అర్జున్ పిల్లలను తన ఇంటికి తీసుకువెళ్లారు.

Read Also: Ponnam Prabhakar: బండి సంజయ్, పురందేశ్వరిపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు..

మరోవైపు.. అల్లు అర్జున్ నివాసానికి జూబ్లీహిల్స్ పోలీసులు వచ్చారు. దాడి ఘటనపై అల్లు అరవింద్ నుంచి ఫిర్యాదుని జూబ్లీహిల్స్ పోలీసులు స్వీకరించారు. దాడి జరిగిన అంశంపై ఇంట్లో ఉన్న వారి వద్ద నుండి వివరాలు సేకరించారు. అయితే.. దాడి జరిగిన సమయంలో అల్లు అర్జున్ ఇంట్లో లేరు. ఈ క్రమంలో.. సెక్యూరిటీ సూపర్వైజర్‌ని వివరాలు అడిగి తెలుసుకుని వెళ్లిపోయారు పోలీసులు.. మరోవైపు దాడి నేపథ్యంలో అల్లు అర్జున్ నివాసం వద్ద పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేశారు. తెలంగాణ బెటాలియన్ పోలీసులతో భద్రత ఉంచారు.

Read Also: Game Changer: కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా.. ‘గేమ్‌ ఛేంజర్‌’ ఏ ఒక్కర్నీ నిరాశపర్చదు: రామ్‌ చరణ్‌