NTV Telugu Site icon

Double Murder: జంట హత్యల కేసుపై పోలీసులు సంచలన విషయాలు..

Murder

Murder

నార్సింగి పీఎస్ పరిధిలో జంట హత్యల కేసుపై పోలీసులు అప్‌డేట్ ఇచ్చారు. ఆదివారం రాత్రి జంట హత్యలు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు మధ్యప్రదేశ్‌కు చెందిన అంకిత్ సాకేత్‌గా గుర్తించారు. నానక్‌రాం గూడ హనుమాన్ టెంపుల్ వద్ద నివాసం ఉంటు్న అంకిత్ సాకేత్.. హౌజ్ కీపింగ్‌గా పని చేస్తున్నాడు. మృతుడి మృతదేహానికి 60 మీటర్ల దూరంలో మహిళ మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు చెప్పారు. ఘటన స్థలంలో బైక్ తాళాలు స్వాధీనం చేసుకున్నారు. బైక్ ట్రేస్ అవుట్ అయితే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఇద్దరు 30 నుండి 32 ఏండ్ల వయసు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు.. మహిళ వివరాలను పోలీసులు సేకరించారు. మృతురాలు బిందు (25) చత్తీస్గడ్ రాష్ట్రానికి చెందిన మహిళాగా గుర్తించారు పోలీసులు. అంకిత్ సాకేత్‌తో సన్నిత సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించారు. ఈనెల 8వ తేదీన మృతుడు అంకిత్‌ ఎల్‌బీ నగర్‌ నుంచి నానక్‌రామ్ గూడకు తీసుకొచ్చి స్నేహితురాలి గదిలో ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. 11వ తేదీ రాత్రి హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు.

Read Also: Amazon Great Republic Day Sale 2025: న్యూ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా?.. ఐకూ ఫోన్లపై వేలల్లో డిస్కౌంట్!

పుప్పాల్‌గూడలోని అనంత పద్మనాభస్వామి దేవాలయం గుట్టపై జంట హత్యలు కలకలం రేపుతుంది. సంక్రాంతి సందర్భంగా చిన్నారులు, యువకులు కలిసి గాలిపటాలు ఎగరవేయడానికి అనంత పద్మనాభస్వామి గుట్టపైకి వెళ్లారు. గాలిపటాలు ఎగిరేస్తుండగా.. అవి తెగి పొదల్లో పడటంతో అక్కడి యువకులు వాటిని తీసుకునేందుకు వెళ్లారు. అయితే, పొదల్లోకి వెళ్లిన యువకులు అక్కడ రెండు మృతదేహాలను చూసి భయంతో వణికిపోయారు. యువకులు వెంటనే ఆ ప్రాంతం నుంచి పరుగులు పెట్టి 100 నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ బృందాలు ఘటనా స్థలంలో ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు.

Read Also: CM Chandrababu: ప్రతి ఇంటికి హెల్త్, వెల్త్, హ్యాపీ అందించాలన్నదే నా లక్ష్యం..

Show comments