NTV Telugu Site icon

Police Fine: ఆ దెబ్బకు ఆడీ కారులో హెల్మెట్ పెట్టుకుని ప్రయాణిస్తున్న వ్యక్తి.. మ్యాటరేంటంటే..

Audi Car

Audi Car

ఆడి కారును నడుపుతున్న సమయంలో హెల్మెట్ ధరించనందుకు ఝాన్సీకి చెందిన ఒక వ్యక్తికి ట్రాఫిక్ పోలీసులు 1,000 రూపాయల జరిమానా విధించారు. ఝాన్సీ నగరంలోని ట్రక్కర్ల యూనియన్ అధ్యక్షుడు బహదూర్ సింగ్ పరిహార్ తన మొబైల్ ఫోన్లో ఇందుకు సంబంధించి జరిమానాను అందుకున్నారు. చలాన్ లోని ఫోటో ద్విచక్ర వాహనానికి చెందినది అయితే., వాహనం ‘మోటారు కారు’ గా పేర్కొనబడింది. ఈ విషయం పై పరిహార్ ఆర్టీఓ కార్యాలయాన్ని సందర్శించి, లోపం గురించి అధికారులకు తెలియజేసినప్పుడు.. లోక్సభ ఎన్నికలు ముగిసే వరకు వేచి ఉండమని అధికారులు తెలిపారు.

Read Also: IPL 2024: సన్ రైజర్స్-గుజరాత్ మ్యాచ్కు వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకపోతే..?

దాంతో అతను ఆర్టిఓ అతనికి మరో చలాన్ జారీ చేయకుండా.. తన కారు నడుపుతున్నప్పుడు పరిహార్ హెల్మెట్ ధరించాలని అనుకున్నాడు. సాంకేతిక సమస్యలు ఉన్నాయని పేర్కొన్నప్పటికీ పోలీసులు ఇటువంటి చర్యలకు ఎలా పాల్పడతారో ఆశ్చర్యంగా ఉంది. సమస్య పరిష్కారం అయ్యే వరకు నేను హెల్మెట్ ధరించడం కొనసాగిస్తానని, లేకపోతే నాకు మరో చలాన్ రావచ్చు అని పరిహార్ చెప్పారు.

ఝాన్సీలోని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఉమాకాంత్ ఓజా మాట్లాడుతూ., ఇది క్లరికల్ ఎర్రర్ అనిపిస్తుంది. ఎందుకంటే చలాన్ లోని ఫోటో హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్న వ్యక్తిది. కానీ వాహనం నంబర్ తప్పుగా పేర్కొనబడింది అని తెలిపారు. ట్రాఫిక్ పోలీసుల నిర్వాకంపై ఆగ్రహానికి లోనైనా అతడు., పది మందికీ ఆ విషయాన్ని తెలపాలని కారులో కూడా హెల్మెట్ పెట్టుకుని తిరుగుతున్నాడు. స్థానిక వ్యక్తి అతడు కారులో ప్రయాణిస్తున్న సమయంలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌ గా మారింది.