దోపిడీ దొంగను పట్టుకోవడానికి పోలీసులు కోవర్టు అపరేషన్ చేపట్టారు. చెంచు యువకులను ఇన్‌ఫార్మర్‌లుగా మార్చి దొంగను పట్టుకునే యత్నం చేశారు. చెంచు యువకుల బాణాలకు దొంగ గాయపడి అడవిలోకి పరారయ్యాడు. చికిత్స కోసం అడవి నుంచి బయటికి వస్తే అరెస్టు చేయాలని పోలీసుల ప్రయత్నిస్తున్నారు. బండి ఆత్మకూరు మండలంలోని నారపరెడ్డికుంటలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నంద్యాల, ప్రకాశం, గుంటూరు జిల్లాలో దోపిడీ దొంగ హనుమంతు వరుస దొంగతనాలకు పాల్పడుతున్నాడు. అతడిపై 12కు పైగా దొంగతనం, దోపిడీ కేసులు నమోదయ్యాయి. హనుమంతు మూడేళ్లుగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు. రైతునగర్లో ప్రేమజంట దోపిడీ హనుమంతు పనేనని పోలీసులకు ఆధారాలు లభ్యం అయ్యాయి. దొంగ దాసరి హనుమంతును పట్టుకోవడానికి పోలీసులు కోవర్ట్ ఆపరేషన్ చేపట్టారు. నారపురెడ్డికుంట చెంచు యువకులను ఇన్‌ఫార్మర్‌లుగా మార్చి పట్టుకునే యత్నం చేశారు. హనుమంతును పట్టుకోవడానికి చెంచు యువకులు బాణాలు వేయగా.. దొంగ గాయపడి అడవిలోకి పారిపోయాడు. చికిత్స కోసం హనుమంతు బయటకు వస్తే అరెస్ట్ చేయాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు.