Site icon NTV Telugu

Uttarpradesh: మహిళా ఎస్సైతో అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరు కానిస్టేబుళ్లు.. అరెస్టు

Arrest

Arrest

Police Constables Misbehave With Woman Sub-Inspector in Uttarpradesh and Arrested : ప్రస్తుతం రంగం ఏదైనా మహిళలకు వేధింపులు తప్పడం లేదు. ఎంటర్టైన్మెంట్ రంగం నుంచి మారుమూల పని చేసే ప్రాంతాల వరకు ప్రతి చోట మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. వారికి ఏదైనా ఆపద వస్తే పోలీసులు అండగా నిలబడతారు. అలాంటిది ఓ మహిళా ఎస్సైతోనే తప్పుగా ప్రవర్తించారు ఇద్దరు పోలీసులు. అయితే వారు ఆమె పై ఆఫీసర్లు కూడా కాదు. ఆమె కింద పనిచేసే కానిస్టేబుళ్లు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ జిల్లాలోని చందౌసి ప్రాంతంలో చోటు చేసుకుంది.

Also Read: Haryana : అమానుషం..కుటుంబ సభ్యుల ముందే ముగ్గురు మహిళలపై సామూహిక అత్యాచారం..

చందౌసి ప్రాంతంలో సబ్-ఇన్‌స్పెక్టర్‌ పనిచేస్తున్నారు  ఓ మహిళ. ఆమె గత బుధవారం విధులు ముగించుకొని తిరిగి వెళుతున్నారు. ఆమెను కారులలో పవన్ చౌదరి, రవీంద్ర అనే ఇద్దరు కానిస్టేబుళ్లు కారులో వెంబడించారు. అనంతరం ఆమెను తిట్టి,  అసభ్యంగా ప్రవర్తించారు. అంతటితో ఆగకుండా చంపేస్తామంటూ పై అధికారినే బెదిరించారు. వీరిపై మహిళ  సబ్-ఇన్‌స్పెక్టర్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ ఇద్దరి కానిస్టేబుళ్లపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్‌ 354  మరియు 341  కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని  సర్కిల్ ఆఫీసర్ దీపక్ కుమార్ తెలిపారు. అంతేకాకుండా వారిద్దరిని సస్పెండ్ చేసినట్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కుల్దీప్ సింగ్ గుణవత్ తెలిపారు. మహిళ  సబ్-ఇన్‌స్పెక్టర్‌ తోనే కింది స్థాయి ఉద్యోగులు ఇలా ప్రవర్తించడం ఆ ప్రాంతంలో చర్చనీయ అంశం అయ్యింది. సొంత డిపార్ట్ మెంట్ లో మహిళ ఉద్యోగులపై ఇలా ప్రవర్తిస్తున్న పోలీసులు తమకు ఎలా రక్షణ కల్పిస్తారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆ మహిళ ఎస్సైతో తమకు ఏదో పర్సనల్ గొడవలు ఉండటం వల్లే వారు ఇలా ప్రవర్తించి ఉంటారని మరికొందరు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఓ మహిళ పట్ల ఇలా ప్రవర్తించడం సరైన పద్దతి కాదని ప్రతి ఒక్కరు ఆ ఇద్దరు కానిస్టేబుళ్ల చర్యను ఖండిస్తున్నారు. వారిని సస్పెండ్ చేయడంతో పాటు వారిపై చర్యలు కూడా తీసుకుంటామని పోలీసులు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

 

 

 

 

Exit mobile version