NTV Telugu Site icon

Theft In Apple Company: అట్లుంటది మనతోటి.. ఏడేళ్లుగా ఎవరికీ తెలియకుండా రూ.140కోట్లు కొట్టేసిండు

Apple

Apple

Theft In Apple Company: తిన్నంటికే కన్నం వేయడం అంటే ఇదేనేమో.. అన్నం పెట్టిన కంపెనీకే సున్నం వేయాలనుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. పనిచేస్తున్న కంపెనీలోనే రూ.140కోట్లు కొట్టేసి ఝలక్ ఇచ్చాడు. ఒకటి, రెండుసార్లు కాదు, ఏకంగా ఏడేళ్లపాటు మోసం చేస్తూనే ఉన్నాడు. మరో ఇద్దరితో జత కలిసి పక్కాగా దొంగతనం చేస్తూ వచ్చాడు. ఇలా ఏడేళ్లలో మొత్తం రూ.140 కోట్లు కొల్లగొట్టేశారు. చేసిన దొంగతనం బయటపడడంతో ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. ఈ ఘరానా మోసం అమెరికాలోని యాపిల్ కంపెనీలో చోటుచేసుకుంది.

Read Also: Himachal Pradesh polls: 34వ సారి ఓటు వేశాడు.. అతని వయసు తెలిస్తే షాకే..

భారత సంతతికి చెందిన ధీరేంద్ర ప్రసాద్ కాలిఫోర్నియాలోని యాపిల్ కంపెనీలో 2008ఉద్యోగంలో చేరాడు. చేరిన మూడేళ్ల నుంచి సంస్థలో దొంగతనం చేయడం మొదలు పెట్టాడు. దొంగ ఇన్ వాయిసులు తయారు చేయడం, విలువైన ఎలక్ట్రానిక్ విడిభాగాలను కొట్టేయడం, వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేయడం వంటివి చేశాడు. వచ్చిన సొమ్మును తన ఖాతాలో వేసుకున్నాడు. 2011 నుంచి 2018 వరకు ఇలా దాదాపు 17 మిలియన్ డాలర్ల సొత్తును కంపెనీ నుంచి మళ్లించుకున్నాడు. ధీరేంద్ర ప్రసాద్ 2018 లో ఉద్యోగానికి రిజైన్ చేసి బయటకొచ్చాడు. నాలుగేళ్ల తర్వాత తను చేసిన మోసానికి పశ్చాత్తాపంతో ఇటీవల పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ మోసంలో తనతో పాటు మరో ఇద్దరు ఉన్నారని పోలీసులకు వెల్లడించాడు. దీంతో ధీరేంద్రతో పాటు యాపిల్ కంపెనీలో ఉద్యోగం చేసిన రాబర్ట్ గేరీ హన్సన్, డాన్ ఎమ్ బేకర్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురిపైనా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.