NTV Telugu Site icon

Shah Rukh Khan: షారుక్ ఖాన్ పుట్టినరోజు కదాని ఇంటికెళ్తే 30 ఫోన్లు కొట్టేశారు.. ముగ్గురి అరెస్ట్!

Shahrukh Khan

Shahrukh Khan

Police Arrested 3 Men Allegedly Stealing Shah Rukh Khan Fans Phones: షారుక్ ఖాన్ పుట్టినరోజు నవంబర్ 2న ఘనంగా జరుపుకున్నారు ఆయన అభిమానులు. మామూలుగానే షారుఖ్ నివాసం మన్నత్ బయట ప్రతిరోజూ వందలాది అభిమానులు గుమికూడుతూ ఉంటారు. షారుక్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా కూడా ఆయన ఇంటి ‘మన్నత్‌’ వెలుపల అభిమానులు గుమిగూడారు. ఈ క్రమంలో 30 మంది ఫోన్లు చోరీకి గురయ్యాయి. నవంబర్ 3న కేసు నమోదు చేసుకుని తర్వాత బాంద్రా పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఘటనా స్థలం మరియు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ముగ్గురు నిందితుల నుంచి 9 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బాంద్రా పోలీసులు శుభం జమ్‌ప్రసాద్‌, మహమ్మద్‌ అలీ, ఇమ్రాన్‌లను అరెస్టు చేశారు.

Bigg Boss Telugu7: టేస్టీ తేజ తొమ్మిది వారాలకు ఎంత తీసుకున్నాడో తెలుసా?

వాస్తవానికి ప్రతి సంవత్సరం షారుక్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు రోడ్డుపై గుమిగూడి సంబరాలు చేసుకుంటారు. నవంబర్ 2, 2023 న, నటుడు మూడు సార్లు వచ్చి అభిమానులను పలకరించాడు కూడా. అయితే ఈ సమయంలో, 30 మంది ఫోన్లు దొంగిలించబడినట్లు నివేదికలు వచ్చాయి. ఈ సంఘటన జరిగిన ఫోన్ దొంగతనంపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రెండు వేర్వేరు కేసుల్లో గుర్తుతెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు కూడా చెప్పారు. తన ఫోన్ దొంగిలించబడిందని, ఈ సంఘటన రాత్రి 12:30 గంటలకు జరిగిందని ఒక జర్నలిస్ట్ ఫిర్యాదు చేశాడు. అదే సమయంలో, కొంతమంది అభిమానులు విడివిడిగా వెళ్లి ఫిర్యాదు చేయగా, 17 మంది అభిమానులు దొంగతనం గురించి ఫిర్యాదు చేసినట్టు అయింది. మొత్తం మీద 30 ఫోన్లు దొంగతనం జరిగినట్టు తేలింది.