Site icon NTV Telugu

Vijayawada: బెజవాడలో బంగ్లాదేశ్ యువకుల కలకలం.. 15 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Ap Police

Ap Police

బెజవాడలో బంగ్లాదేశ్ కు చెందిన యువకుల కదలికలు కలకలం రేపుతున్నాయి. విజయవాడ నగరంతో పాటు తాడిగడప పెనమలూరు పోరంకి ప్రాంతాల్లో సుమారు 15 మంది బంగ్లాదేశ్ లోని మయన్మార్కు చెందిన యువకులు ఉన్నట్టు విజయవాడలోని కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులకు సమాచారం అందింది. 15 మంది యువకుల్లో 8 మంది ఈ ఏడాది జనవరిలో నగరానికి వచ్చినట్టు ఏడుగురు నిన్న రాత్రి వచ్చినట్టు గుర్తించారు.

Also Read:Tamannaah: మైసూర్ శాండల్ బ్రాండ్ అంబాసిడర్‌గా తమన్నా.. కన్నడ సంఘాలు తీవ్ర అభ్యంతరం

ఉగ్ర లింకులు రాష్ట్రంలో బయట పడటంతో బంగ్లాదేశ్ యువకుల కదలికలపై పోలీసుల దృష్టి పెట్టారు. మొత్తం15 మందిని అదుపులోకి తీసుకున్నారు బెజవాడ పోలిసులు. నగర పరిసర ప్రాంతాల్లో భవన నిర్మాణ కార్మికులుగా వీరు పనిచేస్తున్నట్టు గుర్తించారు. అందర్నీ రహస్య ప్రాంతానికి తీసుకువెళ్లి విచారిస్తున్నారు. వీరిపై కేసులు ఉన్నాయా ఏ కారణాలతో దేశానికి వచ్చారు అనే వివరాలు సేకరిస్తున్నారు.

Exit mobile version