NTV Telugu Site icon

Kolkata Doctor Murder: పోలీసులు విద్యార్థులను ఉరికించి కొడుతున్నారు.. కొందరి పరిస్థితి విషయం!.. (వీడియో)

Kolkata

Kolkata

కోల్ కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసుపై దేశ వ్యాప్తంగా విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా.. నేడు రాష్ట్ర రాజాధాని కోల్ కతాలో విద్యార్థులు మరోసారి పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. రాష్ట్ర సచివాలయం ముట్టడికి యత్నించడంతో గందరగోళం నెలకొంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేస్తున్నారు. విద్యార్థులు ఇప్పటికే ‘నబన్న అభియాన్’ కింద నిరసన ప్రకటించారు. దీన్ని అడ్డుకునేందుకు ఉదయం నుంచే పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. హౌరా బ్రిడ్జికి సీలు వేశారు. బ్రిడ్జిపై ఇనుప గోడను నిర్మించారు. 4 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.

READ MORE: Yahya Sinwar: ఏం గతి పట్టింది..ఇజ్రాయిల్‌కి భయపడి ఆడవేషంలో హమాస్ కీలక నేత..

కాగా.. నిరసనలకు సంబంధించి ఓ జాతీయ మీడియా సంస్థల్లో వీడియోలు వైరల్ గా మారాయి. ఈ వీడియో ప్రకారం ..పోలీసులు విద్యార్థులను రోడ్లపై పరిగెత్తించి కొడుతున్నారు. దాదాపు వెయ్యికి పైగా నిరసనకారులు హేస్టింగ్స్ ప్రాంతానికి చేరుకున్నారు. కొందరు బారికేడ్లు ఎక్కారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. నబన్న (రాష్ట్ర సచివాలయం) వరకు నిరసన కవాతును ఆపడానికి పోలీసులు హౌరా బ్రిడ్జిపై బారికేడ్లు వేశారు. నిరసనకారులు దూకి ముందుకు సాగడం ప్రారంభించారు. గందరగోళ పరిస్థితి నెలకొనడంతో పోలీసులు వాటర్ కెనాన్లు, లాఠీచార్జి చేశారు. ఈ ఘటనలో చాలా మందికి గాయాలయ్యాయని విద్యార్థి సంఘం నాయకులు తెలిపారు. కొందిరి ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. వారి ఆరోగ్య పరిస్థితిపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ఈ విద్యార్థి సంఘానికి బీజేపీ తప్ప ఇంత వరకు ఏ ప్రధాన పార్టీ, నాయకులు సపోర్ట్ చేయడం లేదు.