Site icon NTV Telugu

Nimmala Ramanaidu: పోలవరం ప్రాజెక్ట్‌పై కీలక అప్డెట్.. అప్పటి వరకు పూర్తి చేస్తామని మంత్రి హామీ!

Nimmala Ramanaidu

Nimmala Ramanaidu

Nimmala Ramanaidu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం పనులు సాగుతున్నాయని, 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. తాజాగా అమరావతిలోఇరిగేషన్ ప్రాజెక్టుల పనుల పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహామూర్తి సహా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు పనులు మొత్తం 87 శాతం పూర్తయ్యాయన్నారు. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం 1034 మీటర్ల వరకు పూర్తయిందని వెల్లడించారు. 2026 సాగు సీజన్ ప్రారంభమయ్యే నాటికి వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తిచేయాలనే లక్ష్యంతో పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. జనవరి మొదటి వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్టును సందర్శించనున్నారని తెలిపారు. అలాగే 456 కోట్ల రూపాయల వ్యయంతో వెలిగొండ ఫీడర్ కెనాల్ పనులను చంద్రబాబు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

READ MORE: Love jihad: హిందువుగా నటిస్తూ వివాహితను మోసం చేసిన ముస్లిం వ్యక్తి..

పోలవరం ప్రాజెక్టుపై గత ప్రభుత్వాన్ని మంత్రి తీవ్రంగా విమర్శించారు. నాడు పోలవరం ప్రాజెక్టును, డయాఫ్రం వాల్‌ను ధ్వంసం చేసిన వైసీపీ ఇప్పుడు తమ పత్రికల్లో రాయడం దొంగే దొంగ అన్నట్లుగా ఉందన్నారు. కేంద్రం రీయింబర్స్ చేసిన 3800 కోట్ల రూపాయలను కూడా మళ్లించి జగన్ పోలవరాన్ని ముంచేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వాసితుల సమస్యలకు ప్రాధాన్యం ఇచ్చామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గత ఒక్క ఏడాదిలోనే నిర్వాసితుల కోసం 1894 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు వెల్లడించారు. ప్రాజెక్టుల పూర్తి ద్వారా రైతులకు సాగునీరు అందించి రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.

READ MORE: VC Sajjanar: న్యూ ఇయర్ వేళ సీపీ సీరియస్ వార్నింగ్.. ఈ 120 ప్రాంతాల్లో ‘డ్రంక్ అండ్ డ్రైవ్’!

Exit mobile version