POK: పీఓకే విదేశీ భూభాగమే.. ఒప్పుకున్న పాకిస్థాన్ గవర్నమెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ గవర్నమెంట్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ కేసు వ్యవహారంలో కోర్టులో పీఓకే కి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK) విదేశీ భూభాగమని పాకిస్థాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్ హై కోర్టులో అంగీకరించింది. అక్కడ తమ దేశానికి సంబంధించిన చట్టాలు.. వర్తించవని తేల్చి చెప్పింది. పాత్రికేయుడి కిడ్నాప్ కేసుపై శుక్రవారం విచారణ సందర్భంగా పాకిస్థాన్ అదనపు అటార్నీ జనరల్ ఇస్లామాబాద్ కోర్టులో ఈమేరకు వ్యాఖ్యానించారు. రావల్పిండిలోని తన ఇంట్లో ఉన్న అహ్మద్ ఫర్హద్ షా అనే పాత్రికేయుడిని పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ సంస్థ మే 15న కిడ్నాప్ చేసింది. దీనిపై ఆయన భార్య అక్కడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై శుక్రవారం జస్టిస్ మోసిన్ అక్తర్ కయాని నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. పాత్రికేయుడిని అహ్మద్ ఫర్హద్‌ను కోర్టు ఎదుట ప్రవేశపెట్టాలని ఆదేశించింది. ప్రభుత్వం తరఫున అదనపు అటార్నీ జనరల్ వాదిస్తూ… ప్రస్తుతం అహ్మద్ ‘పీవోకే’లో పోలీస్ కస్టడీలో ఉన్నట్లు కోర్టుకు వెల్లడించారు. అది విదేశీ భూభాగమని, అక్కడ ప్రత్యేక రాజ్యాంగం, చట్టాలు ఉంటాయని, పాకిస్థాన్ చట్టాలు చెల్లబోవని తేల్చేశారు.
READ MORE:Dinesh Karthik: క్రికెట్ కి గుడ్ బై చెప్పిన దినేశ్ కార్తిక్
Also Read
- WhatsApp New Feature: వాట్సాప్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. మరో స్మార్ట్ ఫీచర్.. మరింత భద్రత..
- Astrology: జూన్ 29 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
ఈ అంశంపై జస్టిస్ కయానీ మాట్లాడుతూ.. ఒకవేళ పీవోకే విదేశీ భూభాగమైతే.. పాకిస్థాన్ రేంజర్లు, పాక్ మిలటరీ ఎందుకు ఆ ప్రాంతంలోకి చొరబడుతున్నారని ప్రశ్నించింది. సామన్యులను విచారణ పేరుతో ఇంటెలిజెన్స్ సంస్థలు బలవంతంగా నిర్బంధించడాన్ని తప్పని స్పష్టం చేసింది. మరోవైపు పాక్ న్యాయవాది వ్యాఖ్యలతో భారత్‌కు మరింత బలం చేకూరినట్లయింది. ‘పీవోకే’ భారత్‌లో అంతర్భాగమని, అది 1947 నుంచి పాక్ ఆక్రమణలో ఉందని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ పలు మార్లు చెప్పారు. పీవోకే ఎప్పటికీ భారత్‌తోనే ఉంటుందని, అది భారత్‌లోనే ఉంటుందని వివిధ సందర్భాల్లో ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Shraddha Kapoor: శ్రద్ధా కపూర్ ‘ఈత’ సినిమాకు ఊహించని చిక్కు.. కోర్టు మెట్లు ఎక్కనున్న కుటుంబం
-
Pawan Kalyan : ఓవర్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న OG 2
-
Team India: పసికూన ఎంత పనిచేసే.. 1050 రోజుల తర్వాత టీమిండియాకు షాక్.. అజేయ పరంపరకు బ్రేక్!
-
NBK 111 : బాలయ్య సినిమా డిసెంబర్ లేదా సంక్రాంతి రిలీజ్ ఫిక్స్
-
WhatsApp New Feature: వాట్సాప్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. మరో స్మార్ట్ ఫీచర్.. మరింత భద్రత..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!