NTV Telugu Site icon

Viral Fevers : రాష్ట్రంలో ప్రబలుతున్న విషజ్వరాలు

Viral Fever

Viral Fever

ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆస్పత్రుల్లో రోగుల తాకిడి పెరిగింది. సంగారెడ్డి జిల్లా ఆస్పత్రిలో ప్రతి రోజు 1600 నుంచి 1800 మంది పేషేంట్స్ అనారోగ్యంతో వైద్యులని ఆశ్రయిస్తున్నారు. రెండ్రోజులకు మించి జ్వరం వస్తే డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా టెస్టులు చేయించుకోవాలని సంగారెడ్డి జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ సలహా ఇస్తున్నారు. ప్రబలుతున్న విషజ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.. విషజ్వరాల కారణంగా ప్రజలు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఇలా వచ్చే వారిలో ఎక్కువగా విష జ్వరంతో పాటు డెంగ్యూ, చికెన్ గున్యా వంటి లక్షణాలతో ఆస్పత్రులకు క్యూకడుతుండగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు పేషెంట్లతో కిటకిటలాడుతున్నాయి.. జ్వరం ఉంటే నిర్లక్ష్యం చేయోద్దని, ఆందోళనకు గురికావద్దని… క్వాలిఫైడ్ డాక్టర్ ను మాత్రమే సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు.

Atishi Marlena: కార్యకర్త నుంచి సీఎం పదవి వరకు… ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ‘అతిషి’ ప్రస్థానం..

ఇదిలా ఉంటే.. భిక్కనూరు పీహెచ్ సీ ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన జ్వర సర్వేను ఆరోగ్య విస్తరణ అధికారి వేంకట రాములు పరిశీలించారు. మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామంలో ఆశా కార్యకర్తలు, అంగన్​వాడీలు జ్వర సర్వే నిర్వహించారు. ఈ సర్వేను పరిశీలించి ఆయన మాట్లాడారు. ఇండ్ల ముందు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామన్నారు. ఆయన వెంట సెక్రటరీ లక్ష్మీ, ఏఎన్ఎం శ్యామల, అంగన్​వాడీ టీచర్​ జ్యోతి, ఆశావర్కర్లు వనజ, రేణుక, లావణ్య తదితరులు పాల్గొన్నారు.

Lebanon: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లలో ఈ బ్యూటీ హస్తం..! ఈమె ఎవరో తెలుసా..?