మహిళా రక్షణ కోసం ప్రభుత్వాలు కఠిన చట్టాలను తీసుకొచ్చి అమలు చేస్తున్నప్పటికీ కొందరు ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. తాజాగా జనగామ జిల్లాలో దారుణం వెలుగుచూసింది. ఇద్దరు బాలికలు, ఒక అబ్బాయితో 60 ఏళ్ల వృద్ధుడు అసభ్యంగా ప్రవర్తించాడు. పిల్లలు తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పాలకుర్తి పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు.
Also Read:Pawan Kalyan: రప్పా రప్పాపై పవన్ కౌంటర్.. బరిలోకి దిగి చూపించు.. జగన్ కు సవాల్
ఇద్దరు బాలికలకి, ఒక బాలుడికి, చాక్లెట్లు, బిస్కెట్ ఇప్పిస్తానని దగ్గరకు తీసుకొని ఫోన్ లో వీడియో చూపిస్తూ వారితో అసభ్యంగా ప్రవర్తించాడు ఆ వ్యక్తి. వ్యక్తి ప్రవర్తన తీరును చిన్నారులు తల్లిదండ్రులకు తెలిపారు. మైనర్ బాలికలతో పాటు మైనర్ బాలుడితో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పాలకుర్తి పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. బాధితుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు విచారణ జరిపారు పోలీసులు. నిందితుడిని కస్టడీలోకి తీసుకొని విచారించారు. నిందితులపై ఫాక్సో కేసు నమోదు చేశారు పాలకుర్తి పోలీసులు. పాలకుర్తి సర్కిల్ పరిధిలో వారం రోజుల పరిధిలో మూడు పోక్సో కేసులు నమోదు కావడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
