POCSO Case: రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్‌షా కోట్‌లో జరిగిన సామూహిక అత్యాచారం ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. అభం శుభం తెలియని బాలికపై ఐదుగురు యువకులు దారుణానికి ఒడిగట్టారు. బాలిక తన తల్లిదండ్రులతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలిక ఆరోగ్యం విషయంలో ఆందోళన వ్యక్తం చేసిన పోలీసులు వెంటనే ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు వెంటనే స్పందించి ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేసిన పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు.
Read Also: Saif Ali Khan Attack Case: సైఫ్ పై దాడి చేసింది అతనే.. వేలిముద్రలు దొరికాయ్?
ఈ ఘటనపై నార్సింగి పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. బాలికకు న్యాయం చేయడం కోసం అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘోర ఘటనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలల భద్రతకు సంబంధించి మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కుటుంబాలు, సమాజం కలిసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. చిన్నారుల భద్రతపై అన్ని చోట్ల జాగ్రత్తలు పాటించాలని పోలీసులు ప్రజలకు సూచించారు. మరిన్ని వివరాలు కోసం దర్యాప్తు కొనసాగుతుందన్నారు అధికారులు.