NTV Telugu Site icon

POCO X6 Neo Price: 16 వేలకే ‘పోకో X6 నియో’ స్మార్ట్‌ఫోన్‌.. 108 కెమెరా, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ!

Poco X6 Neo Price

Poco X6 Neo Price

POCO X6 Neo 5G Smartphone Launch and Price in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ షావోమీ సబ్‌బ్రాండ్‌ ‘పోకో’ బడ్జెట్‌ ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఎక్స్‌ సిరీస్‌లో ఇప్పటికే పోకో ఎక్స్‌ 6, పోకో ఎక్స్‌ 6 ప్రోను తీసుకొచ్చిన కంపెనీ.. తాజాగా ‘పోకో ఎక్స్‌6 నియో’ను రిలీజ్ చేసింది. 108 కెమెరా, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతో ఈ ఫోన్‌ వస్తోంది. మార్చి 13 నుంచి ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ విక్రయాలు మొదలు అయ్యాయి.

POCO X6 Neo Price and Offers:
పోకో ఎక్స్‌6 నియో స్మార్ట్‌ఫోన్‌ రేండు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.15,999 కాగా.. 12జీబీ+256 జీబీ వేరియంట్‌ ధర రూ.17,999గా ఉంది. ఇది బ్లాక్‌, బ్లూ, ఆరెంజ్‌ రంగుల్లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌పై తగ్గింపు ఆఫర్ ఉంది. అలానే ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌ల ద్వారా చెల్లింపుపై రూ.1000 తక్షణ తగ్గింపును అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుపై 5% క్యాష్‌బ్యాక్ ఉంది.

POCO X6 Neo Camera and Battery:
పోకో ఎక్స్‌6 నియో స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్‌ డిస్‌ప్లేతో వస్తుంది. 120 రిఫ్రెష్‌ రేటు, 1000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఉంది. మీడియాటెక్‌ డైమెన్‌సిటీ 6080 ప్రాసెసర్‌ను ఇందులో అమర్చారు. 108 ఎంపీ ప్రధాన కెమెరా, 2 ఎంపీ డెప్త్‌ సెన్సర్‌.. 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14తో ఇది పనిచేస్తుంది. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వస్తున్నా ఈ ఫోన్ 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

Also Read: BSNL Recharge Plans 2024: బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్లకు శుభవార్త.. రెండు ప్రీపెయిడ్‌ ప్లాన్ల గడువు పెంపు!

POCO X6 Neo Updates:
పోకో ఎక్స్‌6 నియో స్మార్ట్‌ఫోన్‌లో 3.5 ఎంఎం హెడ్‌ఫోన్‌ జాక్, ఐఆర్‌ బ్లాస్టర్‌, ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ వంటి ఫీచర్స్ ఉన్నాయి. రెండు ఆండ్రాయిడ్‌ అప్‌డేట్స్‌, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ లభిస్తాయి. శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎఫ్15 5G, రియల్‌మీ 12 5G, : రెడ్‌మీ నోట్‌ 13 5G మరియు ఐకూ జెడ్‌9 5G వంటి స్మార్ట్‌ఫోన్‌లకు గట్టి పోటీని ఇస్తుంది.