NTV Telugu Site icon

Poco M7 5G: కేవలం రూ.9999కే ఇన్ని ఫీచర్స్ ఏంటి భయ్యా!

Poco M7

Poco M7

Poco M7 5G: బడ్జెట్ ఫోన్ల మార్కెట్ లో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. భారతదేశంలో వినియోగదారులు మంచి ఫీచర్లు, తక్కువ ధరలో అందుబాటులో ఉండే ఫోన్లను కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ పోకో (Poco) తాజాగా భారత మార్కెట్‌లో తన కొత్త ఫోన్ పోకో M7 5G (Poco M7 5G) ను విడుదల చేసింది. ఈ మొబైల్ బడ్జెట్ ధరలో విడుదలైన.. సూపర్ ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఇక పోకో M7 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే..

Read Also: IPL 2025: టీం కొత్త కెప్టెన్‌, వైస్‌ కెప్టెన్‌ పేర్లను ప్రకటించిన కేకేఆర్‌

Poco M7 5G స్మార్ట్‌ఫోన్ 6.88 అంగుళాల HD+ భారీ డిస్‌ప్లేను కలిగి ఉండి.. ఏకంగా 120Hz రీఫ్రెష్ రేట్‌తో ఈ డిస్‌ప్లే అందరిని ఆకట్టుకునేలా ఉంది. ఇక ఈ డిస్‌ప్లే ప్రత్యేకత ఏమిటంటే.. ట్రిపుల్ TUV సర్టిఫికేషన్ ఉండడం కారణంగా ఎక్కువ సమయం వినియోగించినా మన కళ్లపై ఒత్తిడి తగ్గిస్తుంది. ఇక ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్‌ పై పనిచేస్తుంది. 6GB ర్యామ్, 8GB ర్యామ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీనిని గరిష్ఠంగా 12GB వరకు పొడిగించుకోవచ్చు. ఈ మొబైల్ శాటిన్ బ్లాక్, మింట్ గ్రీన్, ఓసియన్ బ్లూ అనే 3 రంగుల్లో అందుబాటులో ఉంటుంది.

ఇక పోకో M7 5G ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS పై పనిచేస్తుంది. కంపెనీ ఈ ఫోన్‌కు రెండు సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను కూడా అందిస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే.. వెనుక వైపు డ్యూయల్ కెమెరాలతో వస్తుంది. 50MP సోనీ ప్రైమరీ కెమెరాతోపాటు.. మరో సపోర్టింగ్ కెమెరా కూడా ఉంది. ముందు వైపు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP సెల్ఫీ కెమెరాను అందించారు.

ఇక ఇందులో 5160mAh బ్యాటరీ ఉండి 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో వస్తుంది. అయితే ఈ విషయంలో కాస్త బ్యాక్ డ్రాప్ అని చెప్పవచ్చు. IP52 రేటింగ్ ఉన్న ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది. ఇక చివరగా ధరల విషయానికి వస్తే.. పోకో M7 5G ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.10,499 కాగా.. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.11,499 గా ఉంది. ఇక ఈ మొబైల్స్ పై మొదటి రోజు సేల్ లో భాగంగా రూ.500 డిస్కౌంట్ లభిస్తుంది. దింతో మొబైల్స్ రూ.9,999, రూ.10,499 కు లభిస్తాయి. మొత్తానికి, పోకో M7 5G బడ్జెట్ ధరలో అదిరిపోయే ఫీచర్లను అందించి. మార్చి 7 మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ ప్రారంభం కానుంది.