Poco M6 5G India Launch: చైనా మొబైల్ కంపెనీ షావోమీ సబ్‌బ్రాండ్ ‘పోకో’ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. పోకో ఎం6 5జీ ఫోన్‌ను భారత్‌లో డిసెంబర్ 22న విడుదల చేస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించారు. ఇది పోకో 5జీ సిరీస్‌లో రెండవ ఫోన్. లాంచ్ తేదీతో పాటు టీజర్‌ను ఎక్స్‌లో పోకో ఇండియా పోస్ట్ చేసింది. గొప్ప ఫీచర్లను కలిగి ఉండే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఇది. ఈ ఫోన్ రెడ్‌మీ 13C 5G యొక్క రీబ్రాండెడ్ వెర్షన్ అని చెప్పొచ్చు.
పోకో ఎం6 5జీ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ SoCతో రానుంది. 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.74-అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఎంఐయూఐ 14-ఆధారిత ఆండ్రాయిడ్ 13లో ఈ స్మార్ట్‌ఫోన్ రన్ అవుతుంది. ఈ ఫోన్ సైడ్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుందని తెలుస్తోంది. 50MP ప్రైమరీ సెన్సార్ మరియు రెండవ డెప్త్ సెన్సార్‌తో డ్యూయల్-రియర్ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీతో రానుంది. మరో రెండు రోజుల్లో పూర్తి వివరాలు తెలియరాన్నాయి.
Also Read: IPL 2024 Auction: టాప్ ప్లేయర్లకు నిరాశే.. ఐపీఎల్ 2024 వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లు వీరే!
పోకో ఇప్పటికే పోకో ఎం6 ప్రో 5Gని భారతదేశంలో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 8GB రామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 SoC, 6.79-అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే మరియు 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. పోకో కూడా పోకో ఎం6 ప్రో 4G వేరియంట్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే ఇండోనేషియాలో అందుబాటులో ఉంది.