పాకిస్థాన్‌లో సాధారణ ఎన్నికలు ముగిసి దాదాపు 10 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా ఉత్కంఠత కొనసాగుతుంది. ఎన్నికల్లో ఏ పార్టీకీ పూర్తి స్థాయి మెజారిటీ రానందున సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు పాకిస్థాన్ ముస్లింలీగ్ – నవాజ్, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ముందుకు వచ్చాయి. అధికార పంపిణీపై ఈ రెండు పార్టీల మధ్య శనివారం నాడు జరిగిన మూడో విడత చర్చలు కూడా అసంపూర్తిగానే ముగిసినట్లు సమాచారం. ఇరు పార్టీల నాయకులు మాత్రం తమ చర్చల్లో గణనీయమైన పురోగతి ఉన్నట్లు ప్రకటించారు. నేడు (సోమవారం) మళ్లీ జరిగే భేటీలో అధికార పంపిణీపై ఓ అంగీకారానికి వస్తే బలమైన ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడాలన్నదే రెండు పార్టీల ముఖ్య ఉద్దేశంగా సంయుక్తి ప్రకటనలో తెలిపింది.
Read Also: Chandigarh Mayor Row: సుప్రీంకోర్టు విచారణకు ముందే చండీగఢ్ మేయర్ రాజీనామా..
ఇక, 265 స్థానాలున్న పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పార్టీ 75 స్థానాలు గెలుచుకుని.. ప్రధానమంత్రి అభ్యర్థిత్వానికి షెహబాజ్ షరీఫ్ పేరును ప్రతిపాదించగా.. 54 స్థానాలు గెలిచిన పీపీపీ, 17 సీట్లు కైవసం చేసుకుని ఎంక్యూఎం-పీ పార్టీతో జత కలిసి సంకీర్ణం ఏర్పాటుకు రెడీ అయింది. జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ)కు మద్దతుగా పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థులు 93 స్థానాల్లో విజయం సాధించారు. ప్రభుత్వంలో చేరకుండా బయటినుంచి మద్దతు ఇస్తామంటున్న బిలావల్ భుట్టో సారథ్యంలోని పీపీపీ దేశాధ్యక్ష స్థానం, స్పీకర్ వంటి రాజ్యాంగ పదవులను కోరుతున్నారు. ఇక, మనసు మార్చుకొని ప్రభుత్వంలో చేరాలని పీఎంల్-ఎన్ ఒత్తిడి తీసుకోస్తుంది.. ప్రావిన్సుల అభివృద్ధి నిధుల కేంటాయింపుపైనా ఇరుపక్షాల నేతలు ఇంకా ఏకాభిప్రాయానికి రాలేదని పాక్ మీడియా తెలిపింది.