PMBJP Warehouse Inaugurated in Uppal: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారతీయ జన ఔషధీ పరియోజన ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి భారతీయ జనసౌది పరియోజన (PMBJP) తెలంగాణ మార్కెటింగ్ కం డిస్ట్రిబ్యూషన్ వేర్ హౌస్ ను లార్విన్ ఫార్మా అండ్ సర్జికల్ వారి సహకారంతో ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏర్పాటు చేశారు.. ఈ వేర్ హౌస్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ హాజరయ్యారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడారు.
మోడీ ప్రభుత్వం 5 లక్షలు ఆయుష్ మాన్ భారత్ ను ఏర్పాటు చేశారని తెలిపారు. రిటైర్మెంట్ 70 సంవత్సరాలు దాటిన అందరికీ ఆయుష్ మాన్ భారత్, కులాలతో సంబంధం లేకుండా ఉచితంగా వైద్యం అందించాలనే లక్ష్యంతో మోడీ ప్రభుత్వం ఉందన్నారు. నరేంద్రమోడీ ప్రభుత్వం తెలంగాణలోని ప్రతీ గల్లీలో వైద్య కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని.. ఈ జన ఔషధ కేంద్రాల్లో మందులు అందే విధంగా చూస్తున్నామన్నారు.
READ MORE: Mohammed Siraj: ప్రేమాయణం అంటూ పుకార్లు.. రాఖీతో చెక్ పెట్టిన సిరాజ్
కేంద్ర ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పించడం కొరకు యువ వికాస్ ను ఏర్పాటు చేసింది అన్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు… 90 శాతం తక్కువ ధరలకు మందులు అందే విధంగా జన ఔషధ కేంద్రాలకు మెడిసిన్లు సప్లై చేసే కేంద్రాన్ని గవర్నర్ ఉప్పల్ లో ప్రారంభించారని.. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలి.. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భవను ప్రతి పేదవాడికి అందే విధంగా చూడాలని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దీనిపైన నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఐదు లక్షలకు ఇంకా కొన్ని కలిపి వైద్యాన్ని అందిస్తారా అనే కోణంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని సూచించారు.
READ MORE: Sangareddy: రోడ్డు సౌకర్యం లేక గర్భిణీ నరకయాతన.. మర్గమధ్యలోనే ప్రసవం..
