సొంతిల్లు లేని వారికి గుడ్‌న్యూస్.. రూ.8 లక్షల రుణాలపై 4% సబ్సిడీ.. PMAY-U 2.0 పథకం పూర్తి వివరాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PMAY-U 2.0: సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక డ్రీమ్. ముఖ్యంగా పట్టణాల్లో అద్దె ఇళ్లల్లో కాలం వెళ్లదీస్తున్న లక్షలాది కుటుంబాలకు సొంత గూడు కట్టుకోవడం నేటికీ ఒక పెద్ద సవాలుగానే మిగిలిపోయింది. స్థలం కొనడానికి డబ్బుల్లేక, ఇల్లు కట్టుకునేందుకు స్తోమత చాలక ఎంతోమంది ఈ కల నెరవేర్చుకోలేకపోతున్నారు. అలాంటి వారందరి ఆశలకు ఊపిరి పోస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అద్భుతమైన పథకమే ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ 2.0 (PMAY-U 2.0). ఈ పథకం ప్రత్యేకత ఏంటంటే.. కేవలం ఇల్లు కొనేవారికో లేదా కట్టుకునేవారికో మాత్రమే కాకుండా, అద్దె ఇళ్లల్లో ఉండే వారికి సైతం ఇందులో ప్రత్యేక అవకాశాలు కల్పించారు.
పట్టణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి వర్గాలను దృష్టిలో ఉంచుకుని దాదాపు 1 కోటి కుటుంబాలకు పక్కా ఇళ్లను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది. మొత్తం రూ.10 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయింపులతో సాగుతున్న ఈ బృహత్తర కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వమే నేరుగా రూ.2.30 లక్షల కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించనుంది. లబ్ధిదారులు తమ అవసరం, ఆర్థిక స్థితిని బట్టి ఇల్లు కట్టుకోవడం, కొనుగోలు చేయడం లేదా సరసమైన ధరల్లో అద్దె ఇంట్లో ఉండటం అనే వేర్వేరు మార్గాలను ఎంచుకునే వీలుంది. మీకు పట్టణంలో సొంత స్థలం ఉండి, ఇల్లు కట్టుకోవడానికి తగినంత డబ్బు లేకపోతే ఈ పథకం ద్వారా రూ.1.5 లక్షల వరకు ఆర్థిక సాయం అందుతుంది. ఒకవేళ అసలు స్థలమే లేకపోయినా ఆందోళన చెందాల్సిన పనిలేదు. ప్రభుత్వం ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్య సంస్థలతో కలిసి చౌకైన ఇళ్లను నిర్మిస్తుంది. ఈ మోడల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EWS) కుటుంబాలకు ఒక్కోంటికి రూ.1.5 లక్షల వరకు కేంద్రం సాయం అందిస్తుంది. దీనివల్ల స్థలం లేని వారికి కూడా సొంతింటి కల నెరవేరుతుంది.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
మరోవైపు ఉద్యోగాలు, పనుల కోసం నగరాలకు వచ్చే వలసదారులు, పారిశ్రామిక కార్మికులు, ఉద్యోగిణులు, పేదల కోసం తక్కువ అద్దెకే లభించే అఫోర్డబుల్ రెంటింగ్ హౌసింగ్ వసతిని కూడా ఇందులో పొందుపరిచారు. ఇక సొంతంగా ఇల్లు కొనుగోలు చేయడానికి హోమ్ లోన్ తీసుకునే వారి కోసం వడ్డీ సబ్సిడీ సదుపాయం ఉంది. రూ.8 లక్షల వరకు పొందే హోమ్ లోన్‌పై ఏటా 4 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. దీని ద్వారా లబ్ధిదారులు గరిష్టంగా రూ.1.80 లక్షల వరకు ఆర్థిక లబ్ధి పొందవచ్చు. అయితే ఈ ప్రయోజనాలు పొందడానికి కుటుంబ వార్షిక ఆదాయ పరిమితి చాలా ముఖ్యం. పథకంలో భాగంగా అర్హతను మూడు కేటగిరీలుగా విభజించారు.
* రూ. 3 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలు
* రూ. 3 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలు
* రూ. 6 లక్షల నుంచి రూ. 9 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలు
పట్టణాల్లో నివసిస్తూ సొంతింటి కల కంటున్నవారు ముందుగా తమ ఆదాయ అర్హతలను సరిచూసుకోవాలి. స్థలం ఉండి డబ్బులు లేనివారు నిర్మాణ సాయాన్ని, స్థలం లేనివారు చౌక గృహాల మోడల్‌ను, లోన్ తీసుకునేవారు వడ్డీ సబ్సిడీని, ప్రయాణాల్లో ఉంటూ తాత్కాలికంగా ఉండేవారు రెంట్ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. అందరి అవసరాలకు తగ్గట్లుగా వేర్వేరు మార్గాలను అందించడం వల్ల PMAY-U 2.0 పథకం పట్టణ పేదలకు నిజమైన భరోసాగా నిలుస్తోంది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..