Site icon NTV Telugu

PM MODI : కాంగ్రెస్ పార్టీని విష్ చేసిన ప్రధాని మోడీ

Modi

Modi

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ భారీ విజయం సాధించింది. ఉదయం నుంచి ఉత్కంఠగా కొనసాగిన ఓట్ల లెక్కింపునకు ఇక తెరపడింది. మొత్తం 224 నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ 136 సీట్లను కైవసం చేసుకుంది. భారతీయ జనతా పార్టీకి 65, జేడీఎస్‌ 19, ఇతరులు 4 స్థానాలకు పరిమితమయ్యాయి. ఇక కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించడంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు.

Also Read : Karnataka Election Results 2023: సీఎం గెలిచాడు.. ఈ మంత్రులు ఓడారు..

రాష్ట్రంలో కాంగ్రెస్‌ విజయం సాధించడంపై ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు. కర్ణాటక అభివృద్ధికి మా పూర్తి సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. కర్ణాటక ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆశిస్తున్నానని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్టర్ వేదికగా ప్రకటించారు. కర్ణాటక ఎన్నికల్లో మాకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు. బీజేపీ కార్యకర్తల కృషిని నేను అభినందిస్తున్నాను. రాబోయే కాలంలో మరింత శక్తితో కర్ణాటకకు సేవ చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

Also Read : Jatin Singh Jamwal: ఆ డైరెక్టర్ పబ్లిక్‌లోనే పాడు పని చేశాడు.. వెక్కి వెక్కి ఏడ్చాను

అయితే బీజేపీ పార్టీ ఘోరంగా కర్ణాటకలో ఓటమి పాలైంది. దీంతో ఇవాళ ( శనివారం ) రాత్రికి ప్రస్తుత కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మ రాజీనామా చేసే అవకాశం ఉంది. కాగా.. రేపు కాంగ్రెస్ పార్టీ నేతలు కీలక సమావేశం కానున్నారు. ఈ మీటింగ్ లో ముఖ్యమంత్రిగా ఎవరిని ఎన్నుకుంటారనే దానిపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే గెలిచిన ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉండేందుకు గెలిచిన వారిని హస్తం నేతలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హోటల్స్ కు తరలిస్తున్నారు. దీంతో రేపు సమావేశం కానున్న సీఎల్పీ భేటీ తర్వాత ఎల్లుండి ( సోమవారం ) కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Exit mobile version