NTV Telugu Site icon

BHISHM Cubes: ఉక్రెయిన్‌కు 4 భీష్మ క్యూబ్‌లను అందజేసిన ప్రధాని నరేంద్ర మోడీ..

Modi

Modi

BHISHM Cubes: శుక్రవారం నాడు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ లో ఆ దేశ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘యుద్ధానికి దూరంగా ఉండడమే భారత్ ఎంచుకున్న రెండో మార్గం అని., తాము యుద్ధానికి దూరంగా ఉంటామని.. అందుకోసం భారత్ మొదటి రోజు నుండి పక్షపాతం కలిగి ఉందని సాపేస్తాం చేసారు. అలాగే మా వైపు శాంతి ఉంది.. మేము యావత్ ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన మహాత్మా గాంధీ భూమి నుండి మేము వచ్చామని తెలిపారు.

Viral News: మరోసారి తండ్రి కానున్న రోహిత్..? జూనియర్ హిట్ మ్యాన్ రాబోతున్నాడా..?

ఇక ప్రధాని తన పర్యటనలో భారత ప్రభుత్వం తరుపున ఉక్రెయిన్ ప్రభుత్వానికి 4 భీష్మ క్యూబ్‌ లను అందజేశారు మోడీ. పోలాండ్ నుంచి ప్రత్యేక రైలులో ఉదయం కీవ్ చేరుకున్న ప్రధానికి ఉక్రెయిన్ ఉప ప్రధానమంత్రి స్వాగతం పలికారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రకారం, మోదీ నాలుగు క్యూబ్‌ లను ఉక్రెయిన్ ప్రభుత్వానికి అందజేసారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్స్కీ దీనికి ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ క్యూబ్‌ లు గాయపడిన వ్యక్తుల చికిత్సను వేగవంతం చేస్తాయి. ముఖ్యంగా ప్రాణాలను కాపాడడంలో సహకారాన్ని అందిస్తాయి. ప్రతి భీష్మ క్యూబ్‌ లో వివిధ రకాల గాయాలు, వైద్య పరిస్థితులకు మందులు, ఇంకా అనేక పరికరాలు ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.