Site icon NTV Telugu

PM Modi: మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రికి ప్రధాని మోడీ నివాళులు

Modi

Modi

మహాత్మా గాంధీ బోధనలు ప్రతి ఒక్కరికి స్పూర్తిదాయకమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆయన కలలను నెరవేర్చేందుకు మనం ఎల్లప్పుడూ కృషి చేద్దామని తెలిపారు. జాతిపిత మహాత్మా గాంధీ 154వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని మోడీ నేడు ఆయనకు నివాళులర్పించారు. గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని ఉదయం 7.30 గంటలకు రాజ్‌ఘాట్‌కు చేరుకుని బాపు సమాధి దగ్గర ఘన నివాళులు అర్పించారు.

Read Also: CM Jagan: మ‌హాత్మా గాంధీ గారి మార్గంలోనే న‌డుస్తున్నాం..

మహాత్మా గాంధీ ప్రభావం ఈ ప్రపంచవ్యాప్తంగా ఉంది అని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఐక్యత, కరుణ స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి మొత్తం మానవాళిని ప్రేరేపిస్తుందంటూ పేర్కొన్నారు. ఆయన కలలను నెరవేర్చేందుకు మనం ఎల్లప్పుడూ కృషి చేద్దామని మోడీ పిలుపునిచ్చారు. అంతేకాకుండా మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా విజయ్ ఘాట్ దగ్గర ప్రధాని మోడీ ఆయనకు నివాళులు ఆర్పించారు. లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ.. ప్రధాని మోడీ మాట్లాడుతూ.. సరళత, దేశం పట్ల అంకితభావం.. ‘జై జవాన్, జై కిసాన్’ ఐకానిక్ పిలుపు నేటికీ ప్రతిధ్వనిస్తుంది అని పేర్కొన్నారు. భావి తరాలకు లాల్ బహదూర్ శాస్త్రి స్ఫూర్తినిస్తుందన్నారు. ఇక, ప్రధాని మోడీతో పాటు ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తదితరులు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రాజ్‌ఘాట్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు ఆర్పించారు.

Exit mobile version