PM Modi Speech: తెలంగాణలోని చారిత్రక ప్రాంతమైన వరంగల్ నగరాన్ని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం సందర్శించారు. ఇక్కడ ప్రసిద్ధ భద్రకాళి ఆలయంలో ప్రధాని మోదీ పూజలు చేశారు.ఈ సందర్భంగా వరంగల్లో రూ.6100కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన అనంతరం ప్రధాని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కొత్త లక్ష్యాల కోసం కొత్త బాటలు వేయాలని తెలంగాణ ప్రజలను కోరారు. తెలంగాణ ప్రజల బలం భారతదేశ బలాన్ని ఎప్పుడూ పెంచుతుందని అన్నారు. నేడు భారతదేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడంలో తెలంగాణ ప్రజల పాత్ర ఎంతో ఉందన్నారు.
Read Also:Kishan Reddy: గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి యాదాద్రికి ఎంఎంటీఎస్
తెలంగాణకు అవకాశాల కొరత లేదన్నారు. తెలంగాణ కనెక్టివిటీపై ప్రత్యేక దృష్టి సారించారు. కొత్త లక్ష్యాల కోసం కొత్త దారులు కూడా వేయాలి. నాగ్‌పూర్-విజయవాడ కారిడార్‌కు కూడా ఈరోజు శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన తెలిపారు. దీంతో తెలంగాణకు ఆధునిక కనెక్టివిటీ లభించనుంది. అభివృద్ధి మంత్రాన్ని పాటిస్తూ తెలంగాణను ముందుకు తీసుకెళ్లాలన్నారు. తెలంగాణ ఆవిర్భావించి ఈ ఏడాదితో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుందన్నారు. తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రమైనప్పటికీ, భారతదేశ చరిత్రలో దాని ప్రజల సహకారం అపారమైనదన్నారు.
Read Also:CM Jagan : మీ జయంతి మాకందరికీ ఒక పండుగ రోజు
ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచం మొత్తం భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నయని… అందులో తెలంగాణ ముందు చాలా అవకాశాలు ఉన్నాయని ప్రధాని మోడీ అన్నారు. నేటి భారతదేశం నవ భారతమని అభివర్ణించారు. యువ శక్తి పుష్కలంగా ఉందన్నారు. 21వ శతాబ్దంలోని ఈ మూడో దశాబ్దంలో మనకు ఒక స్వర్ణ కాలం వచ్చింది. ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలన్నారు. త్వరితగతిన అభివృద్ధి చెందే అవకాశంలో దేశంలోని ఏ మూల కూడా వెనుకబడి ఉండకూడదన్నారు.
