PM Modi: సద్గురు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీవాసుదేవ్‌కు బ్రెయిన్ సర్జరీ జరిగింది. హఠాహత్తుగా ఆయనకు ఆరోగ్యం సీరియస్ కావడంతో హుటాహుటిన ఢిల్లీలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆయనకు స్కానింగ్‌లు నిర్వహించి.. డాక్టర్లు బ్రెయిన్ సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో కోలుకుంటున్నారు.
ప్రధాని మోడీ సద్గురుకు ఫోన్ చేసి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. అనంతరం త్వరగా కోలుకోవాలంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. సద్గురుతో ఫోన్‌లో మాట్లాడినట్లు ప్రధాని తెలిపారు. మంచి ఆరోగ్యంతో తిరిగి రావాలని మోడీ ఆకాంక్షించారు.
Also Read
- Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
- India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- West Bengal: మారనున్న పశ్చిమ బెంగాల్ పేరు.. కొత్త పేరు ఇదే!
మెదడులో బ్లీడింగ్ కావడంతో ఈ నెల 17న ఆస్పత్రిలో చేరిన ఆయనకు అదేరోజు సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆయన వేగంగా కోలుకుంటున్నారని ఈషా ఫౌండేషన్ తెలిపింది. అలాగే ఆయనకు వెంటిలేటర్ కూడా తొలగించారు. అత్యంత వేగంగా కోలుకుంటున్నారని డాక్టర్లు కూడా వెల్లడించారు.

గత కొద్ది రోజులుగా సద్గురు విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్నారు. దీంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. వైద్యులు టెస్టులు చేయగా.. ఆయనకు మెదడులో భారీ రక్తస్రావం, మరియు వాపు ఉన్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే బ్రెయిన్‌కు శస్త్ర చికిత్స నిర్వహించారు.
సద్గురు మెదడులో ప్రాణాంతక పరిస్థితి ఉందని అపోలో సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ వినిత్ సూరి తెలిపారు. CT స్కాన్ తర్వాత మెదడులో తీవ్రమైన వాపును గుర్తించినట్లు వెల్లడించారు. రోజువారీ కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో సద్గురు నొప్పిని పట్టించుకోలేదని తెలుస్తోంది. నొప్పి తీవ్రత ఎక్కువ కావడంతోనే సద్గురు ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ఆస్పత్రిలో చేరిన కొన్ని గంటల్లోనే సద్గురు బ్రెయిన్ సర్జరీ చేయించుకున్నారు.
ప్రస్తుతం సద్గురు ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోంది. అన్ని అవయవాలు పని చేస్తున్నాయని వైద్యులు తెలిపారు. ఊహించిన దాని కంటే ఎక్కువగా సద్గురు కోలుకుంటున్నారని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం సద్గురు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే దేశ రాజధాని ఢిల్లీలో సమావేశాలు, సమ్మేళనానికి హాజరయ్యేందుకు సద్గురు వచ్చారు. హస్తినకు చేరుకున్నాక ఈ పరిస్థితులు తలెత్తాయి.
తాజావార్తలు
-
Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
-
Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
-
India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!