Site icon NTV Telugu

PM Modi: అహ్మదాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోడీ

Pm Modi

Pm Modi

PM Modi: లోక్‌సభ ఎన్నికల మూడో విడత పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల మూడో విడత పోలింగ్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఉదయం అహ్మదాబాద్‌లోని ఓ పాఠశాలలో ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. నగరంలోని నిషాన్ హయ్యర్ సెకండరీ పాఠశాలలోని పోలింగ్ బూత్‌లో ప్రధాని ఓటేశారు. ఉదయం 7:30 గంటల తర్వాత ప్రధాని పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా ఆయనకు స్వాగతం పలకగా.. ఇద్దరు నేతలు బూత్‌కు చేరుకున్నారు. ప్రధాని మోదీని చూసేందుకు భారీగా తరలివచ్చిన జనం రోడ్డు పక్కనే ఉండి నినాదాలు చేశారు.

Read Also: Lok Sabha Elections 2024: నేడే మూడో దశ.. 93 స్థానాల్లో పోలింగ్.. బరిలో అమిత్ షా, సింధియా

ఓటింగ్ బూత్‌కు వెళుతున్న సమయంలో ప్రధాని చిత్రపటంపై మద్దతుదారుడికి తన ఆటోగ్రాఫ్ ఇచ్చారు. గాంధీనగర్ నుంచి పోటీ చేస్తున్న అమిత్‌ షా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. లోక్‌సభ ఎన్నికల మూడో విడతలో 10 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 93 నియోజకవర్గాల్లో ఈరోజు ఓటింగ్ జరుగుతోంది.

 

Exit mobile version