Site icon NTV Telugu

PM Modi: మరోసారి అత్యంత ప్రజాదరణ కలిగిన ప్రజాస్వామ్య నేతగా మోడీ రికార్డ్.. టాప్-5లో కనపడని ట్రంప్..!

Modi

Modi

PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ గల ప్రజాస్వామ్య నాయకుడిగా నిలిచారు. అమెరికాలోని బిజినెస్ ఇంటెలిజెన్స్ సంస్థ మోర్నింగ్ కన్సల్ట్ విడుదల చేసిన తాజా “గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్స్” ప్రకారం, మోడీకు 75% ప్రజాదరణ లభించింది. ఈ సర్వే జూలై 4 నుండి 10 వరకు నిర్వహించబడింది. ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రజాస్వామ్య దేశాల్లోని నేతలపై ప్రజాభిప్రాయాన్ని ఎనిమిది రోజుల గడిచిన తర్వాత సగటు ఆధారంగా నమోదు చేస్తుంది.

Mirai : మిరాయ్ మాస్ ఎంట్రీ షురూ.. యూత్‌ఫుల్ బీట్‌తో ఫస్ట్ సింగిల్ రిలీజ్

ఈ లిస్ట్ లో మోడీ తరువాత కొరియా కొత్త అధ్యక్షుడు లీ జే మియంగ్ 59% ప్రజాదరణతో రెండవ స్థానంలో నిలిచారు. ఈ ఓటింగ్ లో మోడీకి నలుగురు భారతీయుల్లో ముగ్గురు మాత్రమే మద్దతు ఇచ్చినట్టు ఈ సంస్థ వెల్లడించింది. మొత్తంగా 18% వ్యతిరేకత వ్యక్తం చేస్తే, 7% ఎటు చెప్పలేమని ఓటు వేశారు. ఇక మరోవైపు అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పదవిలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్.. ఈసారి కేవలం 44% ప్రజాదరణతో ఎనిమిదవ స్థానంలో నిలిచారు. ట్రంప్ తీసుకున్న అంతర్జాతీయ, దేశీయ విధానాలపై తీసుకున్న నిర్ణయాలు ఆయన ప్రజాదరణపై ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

Mirai : మిరాయ్ మాస్ ఎంట్రీ షురూ.. యూత్‌ఫుల్ బీట్‌తో ఫస్ట్ సింగిల్ రిలీజ్

ఈ నివేదికపై భారతీయ జనతా పార్టీ (BJP) స్పందించింది. పార్టీలోని పలువురు నేతలు మోడీని అభినందిస్తూ ట్వీట్లు చేశారు. బీజేపీ ఐటీ సెల్ సోషమీడియాలో పోస్ట్ చేస్తూ.. “ఒక బిలియన్‌ మందికి మించిన భారతీయుల ప్రేమ, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది గౌరవంతో మోడీ మరోసారి ప్రపంచ నాయ‌క‌త్వ అగ్ర స్థానంలో నిలిచారు. శక్తిమంతమైన నాయకత్వం, గ్లోబల్ గౌరవం.. భారత్ సురక్షిత చేతుల్లో ఉంది” అంటూ పేర్కొన్నారు. ప్రధాని మోదీకి లభించిన ఈ అత్యున్నత రేటింగ్, కేవలం దేశీయంగా కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆయన నాయకత్వంపై నమ్మకాన్ని చూపించడంలో ప్రతిబింబంగా నిలుస్తోంది.

Exit mobile version