Site icon NTV Telugu

Vande Bharat Train: వందేభారత్ ట్రైన్ ప్రారంభానికి అంతా రెడీ

vandebharat train

Collage Maker 15 Jan 2023 08.24 Am

వందే భారత్ ట్రైన్.. రైల్వే ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. రైల్వే శాఖ అత్యంత ప్రతిష్టాత్మకం గా నడుపుతున్న వందే భారత్ రైలు రాకపట్ల తెలుగు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇవాళ ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ నుంచి వందే భారత్ ట్రైన్ ప్రారంభం అవుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పటికి దేశవ్యాప్తంగా 5 ట్రైన్లను ప్రారంభించారని.. సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య ఇవాళ ప్రారంభం అయ్యే రైలు ఆరవది. దేశవ్యాప్తంగా 100 వందేభారత్ ట్రైన్లను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది రైల్వేశాఖ.

Read Also: Airport Metro: శరవేగంగా ఎయిర్‌పోర్ట్ మెట్రో నిర్మాణం.. 21 కిలోమీటర్లు సర్వే పూర్తి

ప్రధాని మంత్రి నరేంద్రమోదీ ఢిల్లీ నుంచి వందేభారత్ ట్రైన్ ను వర్చువల్ గా ప్రారంభిస్తారు. ప్రోటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్ తో సహా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ నుంచి ప్రారంభం అయి విశాఖపట్నం చేరుకుంటుంది. వందేభారత్ ఎక్స్ ప్రెస్ వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం స్టేషన్లలో ఈ ట్రైన్ కు హాల్టింగ్ సౌకర్యం కల్పించారు.

ఇవాళ ఒక్క రోజు మాత్రం 22 రైల్వే స్టేషన్లలో ఆగుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. చర్లపల్లి, భువనగిరి, జనగాం, ఖాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, కొండపల్లి, విజయవాడ, నూజివీడు, ఏలూరు, తాడేపల్లి గూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ, విశాఖపట్నం స్టేషన్లలో ఆగుతుందని వెల్లడించారు. అందరికి పరిచయం కావాలనే ఉద్దేశంతో అన్ని రైల్వే స్టేషన్లలో ఆపుతున్నారు. సంక్రాంతి పండగరోజు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పండగ కానుకగా వందేభారత్ ట్రైన్ ను ప్రారంభిస్తుంది.

వందేభార‌త్ ఎక్స్‌ప్రెస్ అనేది సెమీ-హై-స్పీడ్, ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ రైలు, దీన్ని భారతీయ రైల్వే తయారుచేసింది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ని డిజైన్ చేసి తయారు చేసింది. భారత ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా చొరవ కింద మొదటి రైలు 97 కోట్ల రూపాయలతో 18 నెలల్లో తయారు చేశారు. అత్యంత వేగంగా గమ్యస్థానాలకు చేర్చే ఉద్దేశంతో ఈ రైలు రూపొందించబడింది.

Read Also: Delivery Boy: కుక్క దాడిలో డెలివరీ బాయ్ మృతి.. గత మూడు రోజులుగా కోమాలో..

Exit mobile version