NTV Telugu Site icon

Rozgar Mela: నేడు లక్ష మందికి ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ లెటర్ల పంపిణీ

Modi

Modi

కేంద్ర ప్రభుత్వ శాఖల్లో నియమితులైన లక్ష మందికి పైగా అభ్యర్థులకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఇవాళ ఉపాధి మేళాలో నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు. ఈ సంద‌ర్భంగా ప్రధాని ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ కర్మయోగి భవన్ మొదటి ద‌శ‌కు శంకుస్థాప‌న చేయ‌నున్నారు. ఇక, ఇవాళ ఉదయం 10:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్తగా నియమితులైన లక్ష మందికి పైగా అభ్యర్థులకు ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేస్తారని ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 47 చోట్ల ఈ ఉపాధి మేళా నిర్వహించనుంది. రెవెన్యూ శాఖ, హోం మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్యా శాఖ, అణు ఇంధన శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, కుటుంబ సంక్షేమం, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖతో పాటు వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో కొత్త నియామకాలు జరిగాయి.

Read Also: Shiva Stotra Puranam: దోషాల నుంచి విముక్తి కోసం ఈ స్తోత్ర పారాయణం చేయండి..

అయితే, దేశంలో ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధాని మోడీ సంకల్పాన్ని నెరవేర్చే దిశగా ఈ జాబ్ మేళా ముందడుగు వేసింది. ఈ రోగ్ గర్ మేళా ఉపాధి కల్పనను పెంచడంతో పాటు యువతకు వారి సాధికారత, దేశాభివృద్ధిలో భాగస్వామ్యానికి లాభదాయకమైన అవకాశాలను అందించాలని భావిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది. కొత్తగా నియమితులైన ఉద్యోగులు కూడా iGOT కర్మయోగి పోర్టల్‌లో ఆన్‌లైన్ మాడ్యూల్ శిక్షణ పొందుతున్నారు.