NTV Telugu Site icon

PM Modi: మంచి మనసు చాటుకున్న ప్రధాని మోడీ.. కాన్వాయ్‌ను ఆపి..!

Pm Modi

Pm Modi

PM Modi stopped his convoy for Ambulance: ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. అంబులెన్స్‌కు దారి ఇవ్వడానికి తన కాన్వాయ్‌ను రోడ్డు పక్కకి మళ్లించారు. ఈ ఘటన ఆదివారం (డిసెంబర్ 17) వారణాసిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోపై నెట్టింట హర్షం వ్యక్తమవుతోంది. ప్రధాని మోడీ అంబులెన్స్‌కు దారి ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది అహ్మదాబాద్‌, హిమాచల్‌ప్రదేశ్‌ పర్యటనలోనూ ప్రధాని తన కాన్వాయ్‌ను ఆపి అంబులెన్స్‌కు దారి ఇచ్చారు.

రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారణాసిలో ఉన్నారు. అదివారం తన నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన రోడ్‌ షోలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సమయంలో అటువైపుగా అంబులెన్స్‌ రావడంను మోడీ గుర్తించారు. ఆ అంబులెన్స్‌కు మార్గం కల్పించేందుకు తన కాన్వాయ్‌ను రోడ్డు పక్కకి మళ్లించాలని భద్రతా అధికారులకు సూచించారు. వెంటనే సిబ్బంది అంబులెన్స్‌కు మార్గం సుగమం చేయడంతో అంబులెన్స్ ఎలాంటి ఆటకం లేకుండా వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Also Read: Mamata Banerjee: పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై స్పదించిన మమతా బెనర్జీ!

2019లో ఓ బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతుండగా.. కవరేజీకి వచ్చిన ఓ ఫొటోగ్రాఫర్‌ కుప్పకూలిపోవడంతో తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి అంబులెన్స్‌ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 2022 సెప్టెంబర్ 30న ప్రధాని కాన్వాయ్ గుజరాత్‌లోని ప్రధాన అంబులెన్స్‌కు దారి ఇచ్చేందుకు రహదారిపై ఆగిపోయింది. ప్రధాని మోడీ అహ్మదాబాద్ నుంచి గాంధీనగర్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. 2022 నవంబర్ 9న హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రాలోని ర్యాలీ నుండి తిరిగి వస్తుండగా అంబులెన్స్‌కు దారి ఇవ్వడానికి మోడీ తన కాన్వాయ్‌ను ఆపారు.

Show comments