Site icon NTV Telugu

79th Independence Day 2025: అణు బెదిరింపులను ఇకపై సహించం.. ఎర్రకోట నుంచి పాకిస్తాన్‌కు ప్రధాని మోడీ అల్టిమేటం

Modi

Modi

79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ న్యూఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసి, జాతినుద్దేశించి వరుసగా 12వసారి ప్రసంగం చేశారు. ఈ సంవత్సరం థీమ్ ‘న్యూ ఇండియా’. ఈ సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆపరేషన్ సిందూర్ విజయాన్ని కూడా జరుపుకుంటున్నారు. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడికి భారతదేశం సైనిక ప్రతిస్పందన అయిన ఆపరేషన్ సిందూర్ ప్రణాళిక, అమలులో పాల్గొన్న సీనియర్ సైనిక అధికారులను 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సత్కరించారు.

Also Read:US Open 2025: ఔరా.. వీనస్‌ విలియమ్స్‌! 45 ఏళ్ల వయసులోనూ

పాకిస్తాన్ దుష్ట కార్యకలాపాల గురించి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. “ఆగస్టు 15వ తేదీ ప్రత్యేక ప్రాముఖ్యతను నేను కూడా చూస్తున్నాను. ఈరోజు ఎర్రకోట నుంచి ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్న ధైర్య సైనికులకు సెల్యూట్ చేసే అవకాశం నాకు లభించింది. మన ధైర్య సైనికులు శత్రువులను వారి ఊహకు అందకుండా శిక్షించారు. సరిహద్దు అవతల నుంచి ఉగ్రవాదులు వచ్చి పహల్గామ్‌లో టూరిస్టులను ఊచకోత కోసిన విధానం. వారి మతాన్ని అడిగి చంపిన తీరు. భర్తను అతని భార్య ముందు కాల్చి చంపారు, తండ్రిని అతని పిల్లల ముందు చంపారు. దీంతో భారత్ మొత్తం పాక్ కు తగిన బుద్ది చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేసింది.

Also Read:Off The Record: ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే రెచ్చిపోతూ గుట్లు బయటేసుకుంటున్నారా?

ఆపరేషన్ సిందూర్ అనేది ఆ కోపానికి వ్యక్తీకరణ. పాకిస్తాన్‌లో జరిగిన విధ్వంసం చాలా పెద్దది, ప్రతిరోజూ కొత్త విషయాలు బయటపడుతున్నాయి. మన దేశం అనేక దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని భరిస్తోంది. ఉగ్రవాదాన్ని, దానిని పెంచి పోషించే వారికి బలాన్నిచ్చే వారిని మేము ఇకపై వేర్వేరుగా పరిగణించము. వారు మానవాళికి శత్రువులు. వారి మధ్య ఎటువంటి తేడా లేదు. భారతదేశం ఇకపై అణు బెదిరింపులను సహించకూడదని నిర్ణయించుకుంది. అణు బ్లాక్‌మెయిల్ చాలా కాలంగా కొనసాగుతోంది. కానీ మేము దానిని సహించమని ఎర్రకోట నుంచి ప్రధాని మోడీ పాక్ కు హెచ్చరికలు జారీ చేశాడు. రక్తం, నీరు కలిసి ప్రవహించకూడదని భారతదేశం నిర్ణయించుకుందని అన్నారు. భారత నదుల నీరు శత్రువులకు సాగునీరు ఇస్తోంది. ఇప్పుడు భారత్ తన వాటా నీటిని పొందుతుంది. భారతదేశ రైతులకు దానిపై హక్కు ఉందని” తెలిపారు.

Exit mobile version