Site icon NTV Telugu

PM Modi: ఇకపై “అణు బ్లాక్‌మెయిలింగ్”కు భయపడము.. శత్రదేశాలకు మోడీ వార్నింగ్

Pm Modi

Pm Modi

ఆపరేషన్ సిందూర్ పై లోక్‌సభలో చర్చ కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్‌సభకు చేరుకున్నారు. ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో ప్రతిపక్ష నేతల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ వర్షాకాల సమావేశాలు భారత్ విజయ్ ఉత్సవానికి నిదర్శనమన్నారు.. ఆపరేషన్‌ సిందూర్‌ విజయానికి ప్రతీకగా విజయ్ ఉత్సవ్.. విజయ్ ఉత్సవ్‌ను దేశం మొత్తం జరుపుకుంటోందని వెల్లడించారు. టెర్రరిస్టుల హెడ్‌ క్వార్టర్స్‌ను ధ్వంసం చేసినందుకు విజయోత్సవాలు.. సిందూర్‌ శపథాన్ని నెరవేర్చినందుకు ఈ విజయోత్సవాలు జరుపుకొంటున్నామని తెలిపారు.. మన ఆర్మీ ధైర్యసాహసాలకు ఈ విజయోత్సవాలని.. టెర్రర్ క్యాంపులను మట్టిలో కలిపేశామని స్పష్టం చేశారు.. ఏప్రిల్ 22న టెర్రరిస్టులు చేసిన దాడి క్రూరత్వానికి ప్రతీక అని మోడీ మండిపడ్డారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో తనకు అండగా నిలిచినందుకు భారత ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని మోడీ అన్నారు.

READ MORE: Rahul Gandhi: దమ్ముంటే ట్రంప్ అబద్దం చెప్పారని ఒప్పుకోండి.. మోడీకి రాహుల్ గాంధీ సవాల్..

ప్రభుత్వం సాయుధ దళాల చేతులను కట్టివేసిందని, పాకిస్థాన్ రక్షణ స్థావరాలపై దాడి చేయడానికి వారికి అనుమతి లేదని రాహుల్ గాంధీ చేసిన వాదనలను ప్రధాని మోడీ తిప్పికొట్టారు. పహల్గామ్ దాడి తర్వాత.. ఉగ్రవాద శక్తులను నిర్మూలిస్తానని తాను హామీ ఇచ్చానని అన్నారు. ఉగ్రవాదులను మట్టుబెట్టి వారికి తగిన గుణపాఠం చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం సాయుధ దళాలకు స్వేచ్ఛనిచ్చిందని మోడీ స్పష్టం చేశారు. ప్రపంచంలో ఏ దేశం కూడా భారతదేశాన్ని ఆపలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్‌సభ వేదికగా హెచ్చరించారు. పాకిస్థాన్‌కు అనుకూలంగా ప్రకటనలు ఇచ్చిన దేశాలు కేవలం మూడు మాత్రమేనని తెలిపారు. దేశ వీరుల పరాక్రమానికి కాంగ్రెస్ మద్దతు లభించకపోవడం దురదృష్టకరమన్నారు. పహల్గామ్‌లో అమాయక ప్రజలను చంపడంలో కూడా కాంగ్రెస్ తన రాజకీయాలను వెతుక్కోవాల్సి వచ్చిందన్నారు. అణు బ్లాక్‌మెయిలింగ్ ఇకపై పనిచేయదని భారతదేశం నిరూపించిందని.. ఈ అణు బ్లాక్‌మెయిలింగ్‌కు భారతదేశం తలవంచదని స్పష్టం చేశారు. భారతదేశం తన సాంకేతిక సామర్థ్యాన్ని చూపించిందని.. దీని రుచి పాకిస్థాన్ చూసిందన్నారు.

 

Exit mobile version