NTV Telugu Site icon

PM Modi: సచిన్‌ టెండూల్కర్ కాశ్మీర్ ట్రిప్‌పై మోడీ కీలక పోస్ట్

Modi

Modi

సచిన్ టెండూల్కర్ దంపతులు (Sachin Tendulkar family) ఈ మధ్య ఇండియా టూరిస్ట్ ప్రాంతాలు చుట్టేస్తున్నారు. ఆ మధ్య సచిన్ దంపతులు ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను సందర్శించి ఉల్లాసంగా గడిపారు. తాజాగా మరోసారి సచిన్, తన భార్య, కుమార్తెతో కలిసి కాశ్మీర్ అందాలను వీక్షించారు. అంతేకాకుండా హిమపాతంలో ముగ్గురు కలిసి ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను సచిన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ విజువల్స్ నెట్టింట తెగవైరల్ అయ్యాయి. సచిన్ పర్యటనపై తాజాగా ప్రధాని మోడీ (PM Modi) స్పందించారు. ‘ఉజ్వల భారత్‌’ గురించి చాటిచెప్పడం అద్భుతమంటూ కొనియాడారు.

సచిన్ కామెంట్స్..
కశ్మీర్‌ (Kashmir) పర్యటన తన జ్ఞాపకాల్లో ఎప్పటికీ అందమైన అనుభవంగా మిగిలిపోతుందని సచిన్ (Sachin Tendulkar) తెలిపారు. చుట్టూ మంచుతో కప్పి ఉన్నప్పటికీ.. అక్కడి ప్రజల ఆత్మీయ ఆతిథ్యం దాన్ని మైమరపించిందన్నారు. మన దేశంలో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయని ప్రధాని మోడీ అన్నారని సచిన్ గుర్తుచేశారు. ఈ ట్రిప్‌ తర్వాత ఆయన మాటలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కాశ్మీర్ పర్యటన తర్వాత తాను చెప్పేది ఒక్కటే.. ‘ఉజ్వల భారత్‌’ ఆణిముత్యాల్లో ఒకటైన జమ్మూకశ్మీర్‌కు విచ్చేసి.. ఇక్కడి ప్రకృతి రమణీయతను ఆస్వాదించాలని సచిన్‌ రాసుకొచ్చారు.

మోడీ ట్వీట్..
ఈ వీడియోకు ప్రధాని మోడీ స్పందిస్తూ సచిన్‌పై ప్రశంసలు కురిపించారు. సచిన్ టూర్ అద్భుతంగా ఉందన్నారు. సచిన్ పర్యటనతో యువత ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలని మోడీ సూచించారు.

ఆ మధ్య ప్రధాని మోడీ లక్ష్యదీప్‌లో పర్యటించి.. భారతీయులు పర్యటించాలని ట్వీట్ చేశారు. కానీ మాల్దీవుల మంత్రులు మాత్రం మోడీపై అక్కసు వెళ్లగక్కారు. దీంతో ఇరు దేశాల మధ్య పెద్ద వివాదమే నడించింది. అంతేకాదు భారతీయులు మాల్దీవుల పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు.

భార్య అంజలి, కుమార్తె సారాతో కలిసి సచిన్‌ కశ్మీర్‌ పర్యటనకు వెళ్లారు. స్థానికంగా ఉన్న ఆలయాలు, పర్యటక ప్రాంతాలను సందర్శించారు. పుల్వామా జిల్లాలోని బ్యాట్‌ తయారీ యూనిట్‌కు వెళ్లారు. పారా క్రికెటర్‌ ఇంటికి వెళ్లడం, వీధుల్లో స్థానికులతో కలిసి క్రికెట్‌ ఆడటంతో పాటు జవాన్లతోను ముచ్చటించారు. తన ట్రిప్‌ వీడియోను ఆయన బుధవారం సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఈ వీడియో మీరు కూడా చూసేయండి.