NTV Telugu Site icon

Trending: ఈ ఒక్క ఫోటోతో ట్రెండింగ్ లోకి భారత ప్రధాని..

Modi

Modi

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ- ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఫోటో ట్విట్టర్ లో ట్రెండింగ్ అవుతుంది. ఈ ఇరువురి మధ్య స్నేహాబంధంపై నెటిజన్స్ చర్చిస్తున్నారు. గత పర్యటనల్లోని వీరిద్దరి ఫోటోలను ‘Melodi’ హాష్ ట్యాగ్ తో ట్వీట్స్ చేయడంతో ట్రెండింగ్ లోకి వచ్చాయి. దుబాయ్ లో జరుగుతున్న కాప్ 28 శిఖరాగ్ర సదస్సులో మోడీతో తీసుకున్న సెల్ఫీని ‘Melodi’ ట్యాగ్ లైన్ తో ట్వీట్ చేశారు. దీంతో వీరి ఇరువురి ఫ్రెండ్షిప్ పై సోషల్ మీడియాలో మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి.

Read Also: DK Sivakumar: కాంగ్రెస్ హైకమాండ్ అలర్ట్.. రంగంలోకి దిగిన డీకే శివకుమార్

నరేంద్ర మోడీతో దిగిన సెల్ఫీని ఇటలీ ప్రధాని మెలోని ఎక్స్ లో షేర్ చేసింది. దీంతో ఈ ఫోటోకు 13.5M వీక్షణలు, 210K లైక్‌లు, 12K కామెంట్స్, 40 రీట్వీట్‌లు వచ్చాయి. కొంతమంది నెటిజన్లు రూపొందించిన వైరల్ ట్రెండింగ్ ‘జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్’ని ఉపయోగించారు. మరి కొంతమంది వ్యక్తులు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ యొక్క ఇటాలియన్ సంబంధాన్ని తెలియజేస్తు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధానమంత్రి మోడీ 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి జార్జియా మెలోనిని భారతదేశానికి ఆహ్వానించాలని మరి కొందరు నెటిజన్స్ హాస్యాస్పదమైన కామెంట్స్ చేశారు. అయితే, ఇంతకుముందు కాప్ 28 శిఖరాగ్ర సమావేశంలో ఈ ఇద్దరు నేతలు కలుసుకున్నారు. భారత్- ఇటలీ మధ్య సుస్థిరమైన, సంపన్నమైన భవిష్యత్తు ఉంటుందని మెలోనీతో కలిసి ఉన్న ఫోటోను కూడా ప్రధాని మోడీ పోస్ట్ చేశారు.