Site icon NTV Telugu

IMC 2025: ఆసియాలోనే అతిపెద్ద టెలికాం ఈవెంట్.. ఇండియా మొబైల్ కాంగ్రెస్ ను ప్రారంభించిన పీఎం మోడీ

Modi

Modi

ఇండియా మొబైల్ కాంగ్రెస్ న్యూ ఢిల్లీలోని యశోభూమిలో జరుగుతోంది. టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT), సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ IMC (ఇండియా మొబైల్ కాంగ్రెస్) 9వ ఎడిషన్‌కు హాజరయ్యారు. అక్టోబర్ 8న ప్రారంభమైన IMC 2025 అక్టోబర్ 11 వరకు కొనసాగుతుంది. ఇది ఆసియాలో అతిపెద్ద టెలికాం అండ్ టెక్నాలజీ ఈవెంట్.

Also Read:Hyderabad: పిల్లల పంచాయితీకి నిండు ప్రాణం బలి.. కొడుకుని కొట్టాడని తండ్రి ఏం చేశాడంటే..?

ఇందులో భవిష్యత్ టెక్నాలజీ ప్రదర్శించబడుతోంది. ఈ సంవత్సరం, IMC థీమ్ “ఇన్నోవేట్ టు ట్రాన్స్ఫార్మ్”, ఇది డిజిటల్ పరివర్తనలో భారతదేశం నాయకత్వాన్ని ప్రదర్శిస్తుంది. ఈ సంవత్సరం 400 కి పైగా కంపెనీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. ఈ సంవత్సరం, ఇండియా మొబైల్ కాంగ్రెస్ 6G, క్వాంటం కమ్యూనికేషన్స్, సెమీకండక్టర్స్, ఆప్టికల్ నెట్‌వర్క్‌లు, సైబర్ మోసాల నివారణపై దృష్టి పెడుతుంది.

టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ.. గత 11 సంవత్సరాలుగా భారతదేశంలో డేటా ఖర్చులు ఎలా తగ్గాయో వివరించారు. గత 11 సంవత్సరాలలో మొబైల్ డేటా ఖర్చులు 98% తగ్గాయని ఆయన పేర్కొన్నారు. ఒకప్పుడు ఒక నిమిషం వాయిస్ కాల్ ఎంతో ఖర్చుతో కూడుకున్నదన్నారు. నేడు, ప్రపంచంలోని మొబైల్ వినియోగదారులలో భారతదేశంలో 20% మంది ఉన్నారు. ఈ సంవత్సరం భారతదేశం స్టార్టప్ ప్రపంచ కప్‌ను కూడా ప్లాన్ చేస్తోందని జ్యోతిరాదిత్య తెలియజేశారు.

Also Read:Trump-Mark Carney: భారత్-పాక్ యుద్ధాన్ని ఆపారు.. ట్రంప్‌పై కెనడా ప్రధాని ప్రశంసలు

IMC 2025లో పాల్గొనడానికి, మీరు ఈవెంట్ అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. ముందుగా, అధికారిక IMC వెబ్‌సైట్ https://www.indiamobilecongress.com/ ని సందర్శించి, “రిజిస్టర్” ఎంపికపై క్లిక్ చేయండి. ఈ ఎంపికను క్లిక్ చేయడం ద్వారా మరొక విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ, మీకు కావలసిన పాస్ రకాన్ని మీరు ఎంచుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి, మీ ఈవెంట్ పాస్‌ను స్వీకరించొచ్చు.

Exit mobile version